×
Ad

Venu : ‘బలగం’ వేణు అందులో రెండు సార్లు స్టేట్ ఛాంపియన్ అని తెలుసా? సినిమాల్లోకి రాకముందు..

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వేణు సినిమాల్లోకి రాకముందు తను ఏం చేసాడో ఆసక్తికర విషయాలు తెలిపాడు.

  • Published On : February 6, 2024 / 10:39 AM IST

Balagam Director Venu Interesting Details before He Entering in Movies

Venu Yeldandi : ఇటీవల ‘బలగం'(Balagam) సినిమాతో దర్శకుడిగా భారీ సక్సెస్ సాధించాడు కమెడియన్ వేణు. ఎప్పుడో 25 ఏళ్ళ క్రితమే సినీ పరిశ్రమలోకి వచ్చి కొన్నాళ్ళు అసిస్టెంట్ గా పనిచేసి, ఆ తర్వాత చిన్నచిన్న పాత్రలు చేసుకుంటూ వచ్చి మున్నా సినిమాతో కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు వేణు. ఆ తర్వాత జబర్దస్త్ షోతో బాగా పాపులర్ అయ్యాడు. అనేక సినిమాల్లో కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్న వేణు ఇటీవల దర్శకుడిగా మారి తెలంగాణ నేటివిటీతో బలగం సినిమా తీసి హిట్ కొట్టాడు.

త్వరలోనే వేణు హీరో నానితో సినిమా తీయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వేణు సినిమాల్లోకి రాకముందు తను ఏం చేసాడో ఆసక్తికర విషయాలు తెలిపాడు. వేణు పేరెంట్స్ కూరగాయల వ్యాపారం చేసేవాళ్ళని, తాను కూడా చిన్నప్పట్నుంచి కూరగాయలు అమ్మానని చెప్పాడు.

Also Read : Rajinikanth : ‘బాబా’ సినిమా రిజల్ట్ రజినీకాంత్‌ని అంత బాధపెట్టిందా? ఏకంగా ఆ నిర్ణయం తీసుకొని..

అయితే.. వేణు తన చుట్టూ ఉన్న వాళ్ళల్లో స్పెషల్ గా ఉండాలని మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడట. మార్షల్ ఆర్ట్స్ లో రెండు సార్లు స్టేట్ ఛాంపియన్ గా కూడా విన్ అయ్యానని తెలిపాడు. చిన్నప్పట్నుంచి అందరూ తనని బాబూమోహన్ కి చుట్టంలా ఉన్నావని, కమెడియన్ లా కనిపిస్తున్నావని అంటుండటంతో సినిమాలపై ఆసక్తి పెరిగి సినిమాల్లోకి వచ్చినట్టు తెలిపాడు.