Balakrishna : బాలయ్య బాబు ‘దాదా’ మళ్ళీ ఆలస్యం..? క్రిస్మస్ కి వస్తుందా?
బాలయ్య మోకాలికి గాయం అయి ఆపరేషన్ జరిగి దాదా షూటింగ్ 2నెలలు నిలిచింది. (Balakrishna)
- Saketh U
- Published on- November 6, 2026 / 09:00 PM IST
Balakrishna
Balakrishna : వీరసింహారెడ్డి బ్లాక్‌బస్టర్ తర్వాత.. నటసింహం బాలయ్య-గోపీచంద్ మలినేని కాంబోలో తెరకెక్కుతోన్న సినిమా దాదా. ముంబై బ్యాక్‌డ్రాప్ మాఫియా కథాంశంతో హై యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న ఈ సినిమాని దసరా బరిలో థియేటర్స్‌లోకి తీసుకురావాలని ముందుగా అనుకున్నారు మేకర్స్. అయితే షూటింగ్ ఆలస్యం అవడంతో రిలీజ్ డేట్ డిసెంబర్ 24 క్రిస్మస్‌కి మార్చారు. తీరా కాకినాడ పోర్టులో కీలకమైన యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణలో బాలయ్య మోకాలికి గాయం అయి ఆపరేషన్ జరిగి దాదా షూటింగ్ 2నెలలు నిలిచింది.
దీంతో దాదా సినిమా క్రిస్మస్ రావడం ఎంతవరకు పాజిబుల్ అనే రూమర్ వైరలవుతోంది. ఇంజ్యూరీ నుంచి కోలుకున్న బాలయ్య సెట్స్‌లో జాయిన్ అయ్యాక దాదా షూటింగ్‌ని పరుగులు పెట్టిస్తున్నారు డైరెక్టర్ గోపీచంద్ మలినేని. థియేటర్స్‌లోకి వచ్చేందుకు ఓన్లీ 50 రోజులు మాత్రమే ఉన్న దాదా సినిమాకి సంబంధించి టాకీ పార్ట్ పూర్తయినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు 90 శాతానికిపైగా షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఫైనల్ స్టేజ్‌కి చేరుకున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇంకా బాలయ్య, కాజల్ అగర్వాల్ కాంబినేషన్‌లో ఒక పాట సహా.. పోస్ట్‌ప్రొడక్షన్, VFX పనులకు మరింత టైమ్ పట్టే పరిస్థితి ఉంది.
Also Read : Chapri : ‘ఛప్రి’ వచ్చేస్తున్నాడు. మళ్ళీ కొత్త కాన్సెప్ట్ తో బండి సరోజ్ కుమార్..
సంక్రాంతి రేసులో ఉన్న కాకా, జనవరి 12 విడుదల సినిమాలు ప్రమోషన్స్‌లో స్పీడ్ చూపిస్తున్నాయి. దీంతో డిసెంబర్ 24 క్రిస్మస్ బరిలో ఉన్న బాలయ్య దాదా సినిమా నుంచి అప్‌డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు నందమూరి అభిమానులు. దాదా నుంచి ఫస్ట్ సాంగ్ అతి త్వరలో విడుదల చేస్తున్నట్లు రీసెంట్‌గా ట్వీట్ వేసిన మేకర్స్. దీంతో దాదా ఎట్టి పరిస్థితుల్లోనూ క్రిస్మస్‌కి థియేటర్స్‌లోకి వచ్చి తీరుతుందని వైరలవుతోన్న పోస్ట్‌పోన్ రూమర్స్‌కి మొత్తంగా ఎండ్‌కార్డ్ వేశారు. మరి బాక్సాఫీస్ దాదాగా బాలయ్య ఈ క్రిస్మస్‌కి ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి.
