NBK108: అనిల్ రావిపూడి మూవీ కోసమే బాలయ్య గడ్డం పెంచుతున్నాడా..?

నందమూరి బాలకృష్ణ నటించిన రీసెంట్ మూవీ ‘వీరసింహారెడ్డి’ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించగా, పూర్తి ఫ్యాక్షన్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులు మంచి మార్కులు వేశారు. ఈ సినిమా అందించిన సక్సెస్‌తో తన నెక్ట్స్ మూవీని ఇప్పటికే స్టార్ట్ చేశాడు బాలయ్య.

NBK108: నందమూరి బాలకృష్ణ నటించిన రీసెంట్ మూవీ ‘వీరసింహారెడ్డి’ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించగా, పూర్తి ఫ్యాక్షన్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులు మంచి మార్కులు వేశారు. ఈ సినిమా అందించిన సక్సెస్‌తో తన నెక్ట్స్ మూవీని ఇప్పటికే స్టార్ట్ చేశాడు బాలయ్య.

NBK108: బాలయ్య సినిమాలో బాలీవుడ్ భామ విలనిజం..?

యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య తన కెరీర్‌లోని 108వ చిత్రాన్ని NBK108 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ కూడా మొదలుపెట్టిన ఈ సినిమాలో బాలయ్య లుక్ ప్రేక్షకులను స్టన్ చేయబోతుందని చిత్ర యూనిట్ పలుమార్లు చెప్పుకొచ్చింది. కాగా, తాజాగా ఈ సినిమాలో బాలయ్య లుక్‌కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో బాలయ్య గుబురు గడ్డంతో కనిపించబోతున్నాడని తెలుస్తోంది.

NBK108: అనిల్ రావిపూడి సినిమాలో బాలయ్య సూపర్ హిట్ ట్రాక్ రీమిక్స్..?

దీని కోసమే ఇటీవల బాలయ్య గడ్డం పెంచుతూ కనిపించాడని సినీ వర్గాలు అంటున్నాయి. ఓ జ్యుయెలరీ షాప్ ఓపెనింగ్‌లో సందడి చేసిన బాలయ్య, గడ్డం పెంచుతూ కనిపించాడు. దీంతో NBK108లో బాలయ్య గుబురు గడ్డంతో కనిపించబోతున్నాడని అభిమానులు కూడా ఫిక్స్ అయ్యారు. ఇక ఈ సినిమాలో అందాల భామ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోండగా, యంగ్ సెన్సేషనల్ శ్రీలీల బాలయ్య కూతురి పాత్రలో నటిస్తుంది.

ట్రెండింగ్ వార్తలు