Balakrishna : బాలయ్యకి హ్యాట్రిక్ ఇచ్చిన ముగ్గురు డైరెక్టర్స్ ఒకే ఫ్రేమ్ లో.. అదిరింది అంటున్న అభిమానులు..
తమ అభిమాన హీరోకి వరుస హిట్స్ తో హ్యాట్రిక్ ఇచ్చిన ముగ్గురు డైరెక్టర్స్ ఒకే ఫ్రేమ్ లో కనపడటంతో బాలయ్య అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
- Saketh U
- Published on- February 17, 2024 / 10:04 AM IST
Balakrishna Hat Trick Movies Directors Boyapati Srinu Gopichand Malineni Anil Ravipudi in Single Frame Photo goes Viral
Balakrishna Movies : నందమూరి బాలకృష్ణ వరుస హిట్స్ తో ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. అఖండ(Akhanda), వీరసింహారెడ్డి(Veera Simha Reddy), భగవంత్ కేసరి(Bhagavanth Kesari).. మూడు సినిమాలతో హ్యాట్రిక్ హిట్ కొట్టారు బాలయ్య బాబు. తాజాగా బాలయ్యకి ఈ హ్యాట్రిక్ సినిమాలు ఇచ్చిన ముగ్గురు డైరెక్టర్స్ ఒకే ఫ్రేమ్ లో కనపడ్డారు.
అఖండ డైరెక్టర్ బోయపాటి శ్రీను, వీరసింహారెడ్డి డైరెక్టర్ గోపీచంద్ మలినేని, భగవంత్ కేసరి డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ముగ్గురు కలిసి దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా టాలీవుడ్ లో జరిగిన ఓ ప్రైవేట్ పార్టీకి ఈ ముగ్గురు డైరెక్టర్స్ హాజరవ్వడంతో ముగ్గురూ కలిసి ఫోటో దిగారు. దీంతో ఈ ఫోటో వైరల్ అవుతుంది.
ఇక తమ అభిమాన హీరోకి వరుస హిట్స్ తో హ్యాట్రిక్ ఇచ్చిన ముగ్గురు డైరెక్టర్స్ ఒకే ఫ్రేమ్ లో కనపడటంతో బాలయ్య అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : Vishwak Sen : విశ్వక్ సేన్ అసలు పేరేంటి? పేరు మార్చగానే సినిమాల్లో కలిసొచ్చింది అంటూ..
