NBK 109 : బాలయ్య బర్త్ డే సర్‌ప్రైజ్ అదిరిందిగా.. బాబీతో బాలయ్య సినిమా.. NBK109 ఓపెనింగ్..
తాజాగా బాలయ్య బాబు అభిమానులకు మరో సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఎవరూ ఊహించని విధంగా నేడు బాలకృష్ణ 109వ సినిమా ఓపెనింగ్ కార్యక్రమం చేశారు.
- Saketh U
- Updated on- June 10, 2023 / 02:45 PM IST
Balakrishna NBK109 Movie announced in Bobby Director opening pooja ceremony happened
Balakrishna : బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ కొట్టాడు బాలకృష్ణ. ప్రస్తుతం బాలకృష్ణ అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో NBK108 సినిమా ‘భగవంత్ కేసరి’ చేస్తున్నారు. తాజాగా నేడు జూన్ 10న బాలయ్య పుట్టిన రోజున భగవంత్ కేసరి సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేసి ఫ్యాన్స్ కి స్పెషల్ ట్రీట్ ఇచ్చారు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. దసరాకు భగవంత్ కేసరి రిలీజ్ కానుంది.
తాజాగా బాలయ్య బాబు అభిమానులకు మరో సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఎవరూ ఊహించని విధంగా నేడు బాలకృష్ణ 109వ సినిమా ఓపెనింగ్ కార్యక్రమం చేశారు. గత కొన్ని రోజులుగా బాలయ్య నెక్స్ట్ సినిమాల గురించి పలు వార్తలు వచ్చాయి. తాజాగా నేడు బాలయ్య బాబు పుట్టిన రోజు సందర్భంగా NBK109వ సినిమా ఓపెనింగ్ పూజా కార్యక్రమం చేశారు. ఈ సినిమా 1980 లో స్టోరీతో ఉండబోతున్నట్టు తెలుస్తుంది. వయోలెన్స్ కి విజిటింగ్ కార్డు అంటూ సినిమాని ప్రకటించారు. ప్రపంచానికి ఇతను తెలుసు, కానీ ఇతని ప్రపంచం ఎవ్వరికి తెలీదు అనే కొటేషన్ తో పోస్టర్ ని రిలీజ్ చేశారు.
బాలకృష్ణ 109వ సినిమా డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ బ్యానర్స్ పై నాగవంశీ, త్రివిక్రమ్ భార్య సౌజన్య నిర్మిస్తున్నారు. సడెన్ గా NBK109 సినిమాను ప్రకటించడంతో అభిమానులు ఆశ్చర్యపోతూనే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బాబీ ఇటీవలే సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో భారీ హిట్ కొట్టాడు. ఇక బాలయ్య కూడా వరుస హిట్స్ మీద ఉండటంతో ఈ సినిమాపై ఇప్పట్నుంచే అంచనాలు నెలకొన్నాయి.
