×
Ad

Balakrishna : ఎన్టీఆర్ 101వ జయంతి.. తండ్రికి నివాళులు అర్పించిన బాలకృష్ణ..

ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నేడు ఎన్టీఆర్ ఫ్యామిలీ, తెలుగుదేశం నాయకులు, ఎన్టీఆర్ అభిమానులు హైదరాబాద్ లో ఉన్న ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆ మహనీయుడికి నివాళులు అర్పిస్తున్నారు.

  • Published On : May 28, 2024 / 09:39 AM IST

Balakrishna Pays Tributes to his Father Nandamuri Taraka Rama Rao at NTR Ghat

Balakrishna : నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఎన్నో సాధించి, ప్రజలకు ఎంతో చేసి, తెలుగు వారికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన మహనీయుడు నందమూరి తారక రామారావు. ఆయన మరణించి కొన్ని సంవత్సరాలు అవుతున్నా ఎప్పటికి తెలుగువారు గుర్తుంచుకుంటారు. గత సంవత్సరం ఎన్టీఆర్ శత జయంతిని తెలుగు రాష్ట్రాల్లో, ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారు ఉన్న చోట ఘనంగా నిర్వహించారు. నేడు మే 28న ఎన్టీఆర్ 101వ జయంతి ఘనంగా నిర్వహిస్తున్నారు.

Also Read : NTR – Kalyan Ram : 101వ జయంతి సందర్భంగా.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన తారక్, కళ్యాణ్ రామ్..

ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నేడు ఎన్టీఆర్ ఫ్యామిలీ, తెలుగుదేశం నాయకులు, ఎన్టీఆర్ అభిమానులు హైదరాబాద్ లో ఉన్న ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆ మహనీయుడికి నివాళులు అర్పిస్తున్నారు. నేడు ఉదయం ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వచ్చి నివాళులు అర్పించగా తాజాగా బాలకృష్ణ వచ్చి తన తండ్రికి ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. అనంతరం ఎన్టీఆర్ గురించి బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ తన తండ్రిని గుర్తుచేసుకున్నారు. సినిమాల్లో, రాజకీయాల్లో ఆయన సాధించిన విజయాలు గుర్తుచేస్తూ ఎన్టీఆర్ అంటే ఒక శక్తి అని అన్నారు.