Balakrishna
Balakrishna : బాలయ్య బాబు సినిమాల్లో ఎంత రఫ్ గా ఉన్నా బయట బంగారం అని అందరికి తెలిసిందే. ఆయన కోపం వస్తే ఎలా ఉంటారో మాములుగా ఉన్నప్పుడు అంతే ప్రేమ కురిపిస్తారు. చిన్న పిల్లల్ని మరింత దగ్గరికి తీసుకుంటారు బాలకృష్ణ. తాజాగా ఓ ఈవెంట్లో బాలకృష్ణ ఇద్దరు పిల్లల్ని దగరికి తీసుకొని ఫోటోలు దిగారు.(Balakrishna)
ఆ పిల్లల కోసం వారి పక్కనే మోకాళ్ళ మీద కూర్చొని మరీ ఫోటోలు దిగారు. బాలయ్య ఆ పిల్లలతో ఫోటోలు దిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ ఆ ఇద్దరు పిల్లలు ఎవరా అనుకుంటున్నారా?
Also Read : Beauty Review : ‘బ్యూటీ’ మూవీ రివ్యూ.. సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్ట్ కి మైండ్ బ్లాక్..
ఈ ఇద్దరూ నటి, యాంకర్ ఉదయభాను కూతుళ్లు. ఉదయభానుకు బాలయ్య అంటే అభిమానం. బాలయ్య కూడా ఉదయభానుని ఇంట్లో మనిషిలా చూస్తారు. ఉదయభానుకు భూమి ఆరాధ్య, యువి నక్షత్ర అని ఇద్దరు కవలలు ఉన్నారు. వీరి మొదటి పుటిన రోజుకు బాలయ్య వచ్చి మరీ ఆశీర్వదించాడు. గతంలో పలుమార్లు ఉదయభాను బాలయ్య నాకు సపోర్టుగా నిలిచారని, నా పిల్లల మీద ప్రేమ చూపిస్తారని తెలిపింది.
ఇప్పుడు ఓ ఈవెంట్లో ఉదయభాను పిల్లలతో వెళ్లగా అక్కడికి బాలయ్య కూడా రావడంతో బాలయ్యతో ఉదయభాను కూతుళ్లు ఫోటోలు దిగుతున్న వీడియో తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో బాలయ్య ఫ్యాన్స్ మా బాలయ్య బాబు బంగారం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : Sundarakanda : తల్లి కూతుళ్ళని లవ్ చేసిన హీరో.. ఓటీటీలోకి వచ్చేస్తుంది.. ఎప్పుడు? ఏ ఓటీటీలో..