Gautham Raju : ఎడిటర్ గౌతంరాజు మృతిపై సంతాపం తెలిపిన బాలకృష్ణ
ప్రెస్ నోట్ లో బాలకృష్ణ.. ''ఎడిటర్ గౌతమ్ రాజు గారి మరణం చాలా బాధాకరం. గౌతమ్ రాజు అద్భుతమైన ప్రతిభ గల ఎడిటర్. నాకెంతో ఆత్మీయులు. మృదు స్వభావి. అనేక విజయవంతమైన సినిమాలకు.............
- Saketh U
- Published On : July 6, 2022 / 12:42 PM IST
Balakrishna
Gautham Raju : తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ పరిశ్రమలో దాదాపు 800కి పైగా సినిమాలకి ఎడిటర్ గా పని చేసిన ప్రముఖ సినీ ఎడిటర్ గౌతంరాజు. గత కొంత కాలంగా గౌతంరాజు అనారోగ్యంతో బాధపడుతున్నారు. మంగళవారం రాత్రి 1.30 గంటలకు ఇంట్లోనే మరణించారు. గౌతంరాజు మరణంతో టాలీవుడ్, సౌత్ సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఎన్నో సంవత్సరాలుగా చాలా సినిమాలకు ఎడిటర్ గా పని చేస్తూ ఎన్నో సూపర్ హిట్ సినిమాలని అందించి అవార్డులు, రివార్డులు కూడా అందుకున్నారు. గౌతంరాజుకి సెలబ్రిటీలు, సినీ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. సినీ ప్రముఖులు ఆయన ఇంటికి వెళ్లి సంతాపం తెలియచేస్తున్నారు. తాజాగా బాలకృష్ణ గౌతంరాజు మృతిపై సంతాపం తెలుపుతూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.
Gautham Raju : ఎడిటర్ గౌతంరాజు మృతిపై సంతాపం తెలుపుతూ చిరంజీవి ఎమోషనల్ ట్వీట్
ఈ ప్రెస్ నోట్ లో బాలకృష్ణ.. ”ఎడిటర్ గౌతమ్ రాజు గారి మరణం చాలా బాధాకరం. గౌతమ్ రాజు అద్భుతమైన ప్రతిభ గల ఎడిటర్. నాకెంతో ఆత్మీయులు. మృదు స్వభావి. అనేక విజయవంతమైన సినిమాలకు కలసి పని చేశాం. ఎడిటర్ గా గౌతమ్ రాజు గారు తెలుగు చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేశారు. ఈరోజు ఆయన మన మధ్య లేకపోవడం ఎంతో దురదృష్టకరం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అని తెలిపారు.
