Sugriva: కుటుంబ కథలో సస్పెన్స్.. సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ‘సుగ్రీవ’
ఏప్రిల్ నెలలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న బాలు చరణ్ సుగ్రీవ(Sugriva) మూవీ.
- V Santhosh Kumar
- Published On : March 29, 2026 / 09:09 AM IST
Balu charan Sugriva movie is ready for release.
Sugriva; బాలు చరణ్, కాజల్ తివారి జంటగా నటిస్తున్న సరికొత్త చిత్రం “సుగ్రీవ(Sugriva)”. ఎస్.జి.ఎస్.వి మూవీస్ పతాకంపై ఎం. పవన్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమాను నర్తు చిరంజీవి తెరకెక్కిస్తుండగా ఏప్రిల్ 24న థియేటర్స్ లోకి వచ్చేందుకు సిద్ధమైంది. సస్పెన్స్, యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్ కలగలిసిన ఒక కంప్లీట్ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా రూపొందింది. ఒక సంతోషకరమైన కుటుంబంలో అనుకోకుండా ఎదురైన సమస్యలు వారి జీవితాలను ఎలా మార్చాయి, ఆ సవాళ్లను వారు ఎలా అధిగమించారనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది.
Ustaad Bhagat Singh OTT: ఓటీటీలోకి ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. స్ట్రీమింగ్ ఎక్కడ? ఎప్పుడంటే?
గోవా, వైజాగ్ వంటి అందమైన ప్రాంతాల్లో చిత్రీకరించిన పాటలు, అద్భుతమైన యాక్షన్ సీక్వెన్సులు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. నిర్మాత పవన్ కుమార్ ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మించగా, దర్శకుడు చిరంజీవి ప్రతి సన్నివేశాన్ని ఎంతో ప్రతిభావంతంగా తెరకెక్కించారు. ఇప్పటికే సారధి స్టూడియోస్‌లో డి.ఐ పనులు, సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదల తేదీని ఖరారు చేసుకోవడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. సుమన్ శెట్టి, ఆర్ ఎక్స్ 100 కరణ్ విజయ్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపిస్తున్న ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పిస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
