Bandla Ganesh : పవన్ అభిమానికి బండ్ల గణేష్ సాయం.. పవన్ కంటే ఎక్కువ సాయం..
అదే అభిమానికి బండ్ల్ గణేష్ కూడా సాయం చేస్తానని ప్రకటించారు. (Bandla Ganesh)
- Saketh U
- Published on- June 17, 2026 / 02:33 PM IST
Bandla Ganesh
Bandla Ganesh : ఇటీవల జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న 17 ఏళ్ళ నిరంజన్ అనే పవన్ కళ్యాణ్ అభిమాని తన హీరోని కలవాలని కోరాడు. ఆ వీడియో వైరల్ అయి పవన్ కళ్యాణ్ వరకు వెళ్ళింది. దీంతో పవన్ నేడు హన్మకొండ హనుమాన్ నగర్‌లోని బాలుడి నివాసానికి వెళ్లి పరామర్శించారు. అభిమానితో, అతని ఫ్యామిలీతో మాట్లాడి వారితో కొంత సమయం గడిపి, వారితో ఫొటోలు దిగారు.
బాలుడి కుటుంబ సభ్యులకు లక్ష రూపాయలు, తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదం అందజేశారు పవన్. నిరంజన్ ఆరోగ్యం కోసం భద్రకాళి గుడిలో కూడా పూజలు చేసారు. పవన్ కళ్యాణ్ హనుమకొండ రావడంతో ఆయన్ని చూసేందుకు అభిమానులు, జనసేన కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
Also See : Pawan Kalyan : అభిమాని కోరిక తీర్చిన పవన్ కళ్యాణ్.. స్వయంగా వెళ్లి.. ఫొటోలు వైరల్..
అయితే అదే అభిమానికి బండ్ల్ గణేష్ కూడా సాయం చేస్తానని ప్రకటించారు. ఈ సందర్భంగా బండ్ల గణేష్ సోషల్ మీడియాలో ప్రకటించారు. తన సోషల్ మీడియాలో.. వరంగల్-హనుమకొండకు చెందిన 17 ఏళ్ల బాలుడు పొనుగోటి నిరంజన్ తీవ్రమైన కిడ్నీ సమస్యతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటుండటం ఎంతో బాధాకరం. చాలా కాలంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని కలవాలనే నిరంజన్ కోరిక నేడు నెరవేరబోతుండటం హృదయాన్ని కదిలించింది. మీడియా మిత్రుల సహకారంతో ఈ విషయం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి చేరగా, ఆయన స్వయంగా నిరంజన్ కలవడానికి హనుమకొండకు వస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి భక్తుడిగా, ఆయన స్ఫూర్తితో పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ తరఫున నిరంజన్ కు, అతని కుటుంబానికి అండగా నిలుస్తూ రూ.5,00,000 (ఐదు లక్షల రూపాయలు) ఆర్థిక సహాయాన్ని ప్రకటిస్తున్నాను అని తెలిపారు. దీంతో బండ్ల గణేష్ ని అభినందిస్తున్నారు.
