Bandla Ganesh : డైరెక్టర్స్‌కి వార్నింగ్ ఇచ్చిన బండ్లన్న.. మా అల్లుడ్ని హీరోగా సినిమా ప్లాన్ చేయకండి.. అల్లుడికి కూడా వార్నింగ్..

ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ లో బండ్ల గణేష్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.(Bandla Ganesh)

  • Published on- August 18, 2026 / 03:57 PM IST

Bandla Ganesh

Bandla Ganesh : నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కూతురు జనని బండ్ల వివాహం ఇటీవల ఆగస్టు 16న ఏపీకి చెందిన వ్యాపారవేత్త సూర్యతేజతో ఘనంగా జరిగింది. ఈ వివాహానికి సినీ, రాజకీయ సెలబ్రిటీలు, రెండు తెలుగు రాష్ట్రాల మంత్రులు హాజరయ్యారు. ప్రీ వెడ్డింగ్, రిసెప్షన్, నిశ్చితార్థం, హల్దీ.. ఇలా పెళ్లివేడుకలు ఘనంగా నిర్వహించారు. అయితే ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ లో బండ్ల గణేష్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ వేడుకల్లో బండ్ల గణేష్ అల్లుడు సూర్య తేజ అదిరిపోయే డ్యాన్స్ వేసాడు. కూతురు జనని కూడా సూర్యతేజతో కలిసి డ్యాన్స్ వేసింది. సూర్య తేజ డ్యాన్స్ కి అందరూ షాక్ అయ్యారు. బండ్లన్న అల్లుడు వేసిన డ్యాన్స్ వీడియోలు వైరల్ గా మారాయి. అయితే అల్లుడి డ్యాన్స్ చూసి బండ్ల్ గణేష్ కూడా షాక్ అయ్యాడు.

Also See : Bandla Ganesh : బండ్ల గణేష్ కూతురు పెళ్లి.. పెళ్లి మండపం చూశారా..? బాహుబలి రేంజ్ లో సెట్స్ వేసి..

దీంతో ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ లో స్టేజిపై బండ్ల గణేష్ మాట్లాడుతూ.. సూర్య నీ డాన్స్, నీ ఎనర్జీ చూస్తుంటే నాకు గుండెల్లో దడ పుడుతుంది. నీకు దండం పెడతాను. నువ్వు బిజినెస్ లోనే ఉండు, పొరపాటున కూడా సినిమాల్లోకి వస్తానని అనకు అని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. అలాగే ఆ రిసెప్షన్ కి వచ్చిన దర్శకులను ఉద్దేశించి.. ఇక్కడ ఉన్న దర్శకులందరూ మా అల్లుడి డాన్స్ మర్చిపోండి. తనని హీరోగా పెట్టి సినిమాలు చేద్దామని అనుకోకండి అని సరదాగా వార్నింగ్ ఇచ్చాడు బండ్ల గణేష్.

అయితే బండ్ల గణేష్ కామెంట్స్ కి అల్లుడు సూర్యతేజ వెంటనే సమాధానమిస్తూ.. మామయ్య నాకు అసలు సినిమాల్లోకి రావాలని లేదు. ఇప్పుడు వేసిన డాన్స్ అంతా కేవలం మీ కూతురిపై ఉన్న ప్రేమతో మాత్రమే అని అన్నారు. మొత్తానికి అల్లుడికి మాత్రం సినిమాల్లోకి రావొద్దు అని క్లారిటీ ఇచ్చేసాడు బండ్ల గణేష్. కానీ మరోవైపు బండ్ల గణేష్ కొడుకు హితేష్ భవిష్యత్తులో హీరోగా ఎంట్రీ ఇస్తాడని రూమర్స్ ఉన్నాయి.

Also See : Bandla Ganesh Daughter Wedding : బండ్ల గణేష్ కూతురు జనని పెళ్లి వేడుక.. హాజరయిన సినీ, రాజకీయ సెలబ్రిటీలు.. ఫొటోలు..