Site icon 10TV Telugu

Beauty Movie Songs : హీరోయిన్ కి స్కూటీ నేర్పిస్తున్న హీరో.. ఈ సాంగ్ విన్నారా.. మంచి మెలోడీ..

Beauty Movie Ankith Koyya Nilakhi Patra Melody Song

Beauty

Beauty : జీ స్టూడియోస్, మారుతీ టీం ప్రొడక్ట్స్, వానర సెల్యూలాయిడ్ సంయుక్త నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమా ‘బ్యూటీ’. విజయపాల్ రెడ్డి అడిదల, ఉమేష్ కుమార్ భన్సల్ నిర్మాతలుగా జె.ఎస్.ఎస్. వర్ధన్ దర్శకత్వంలో అంకిత్ కొయ్య, నీలఖి జంటగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి సాంగ్స్, టీజర్ రిలీజయ్యాయి. ఈ సినిమా ఒక యూత్ ఫుల్ లవ్ స్టోరీ అని తెలుస్తుంది.(Beauty)

బ్యూటీ సినిమా సెప్టెంబర్ 19న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ఇటీవల బ్యూటీ సినిమా నుంచి ‘ప్రెట్టీ ప్రెట్టీ..’ అనే మరో పాటని రిలీజ్ చేసారు. ఈ పాట ప్రస్తుతం ట్రెండ్ అవుతూ యూత్ కి కనెక్ట్ అవుతుంది. విజయ బుల్గానిన్ సంగీత దర్శకత్వంలో సనారే రాయగా పీవీఎన్ఎస్ రోహిత్ ఈ పాటని పాడారు. ఈ సాంగ్ లో హీరో హీరోయిన్ కి స్కూటీ నేర్పించడం, వారిద్దరి మధ్య కెమిస్ట్రీ చుట్టూ తిరుగుతుంది.

Also See : Pawan Kalyan Rare Photos : పవన్ కళ్యాణ్ బర్త్ డే స్పెషల్.. పవన్ రేర్ ఫొటోలు చూశారా..?

మీరు కూడా ఈ క్యూట్ మెలోడీ సాంగ్ ని వినేయండి..

 

 

Exit mobile version