Bellamkonda Sai Sreenivas : పెళ్లి డేట్ ప్రకటించిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. ఎప్పుడు? ఎక్కడ?

ఇటీవల మార్చ్ 8న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కావ్య రెడ్డి అనే అమ్మాయిని నిశ్చితార్థం చేసుకున్నారు. (Bellamkonda Sai Sreenivas)

  • Updated on- April 3, 2026 / 05:14 PM IST

Bellamkonda Sai Sreenivas Marriage

Bellamkonda Sai Sreenivas : గత కొన్నాళ్లుగా ఫ్లాప్స్ చూసిన హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇటీవలే భైరవం, కిష్కింధపురి సినిమాలతో హిట్స్ కొట్టి ఫామ్ లోకి వచ్చాడు. ఈ సీజన్ లో టాలీవుడ్ సెలబ్రిటీలు అంతా పెళ్లిళ్లు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ లిస్ట్ లో శ్రీనివాస్ కూడా చేరుతున్నాడు.

ఇటీవల మార్చ్ 8న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కావ్య రెడ్డి అనే అమ్మాయితో రోకా ఈవెంట్ ని చేసుకున్నారు. తాజాగా వీరి పెళ్లి డేట్, నిశ్చితార్థం డేట్ ని ప్రకటించారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ – కావ్య రెడ్డి నిశ్చితార్థం ఏప్రిల్ 5న హైదరాబాద్ లో జరగనుంది. ఇక వీరి పెళ్లి తిరుపతిలో ఏప్రిల్ 29న కేవలం ఇరు కుటుంబాలు, సన్నిహితుల మధ్యే వేంకటేశ్వరస్వామి వారి సన్నిధిలో పెళ్లి చేసుకోబోతున్నారు. అనంతరం మేలో హైదరాబాద్ లో ఘనంగా రిసెప్షన్ వేడుక ఉండొచ్చు అని సమాచారం.

Also See : Bandhavi Sridhar : మసూద భామతో ఆది సాయి కుమార్ కొత్త సినిమా.. ఓపెనింగ్ ఫోటోలు..

దీంతో కాబోయే ఈ జంటకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సాయి శ్రీనివాస్ చేసుకోబోయే అమ్మాయి కావ్య తండ్రి లాయర్. వీళ్ళ ఫ్యామిలిలో చాలా మంది లాయర్లు ఉన్నారని సమాచారం. ఇక సాయి శ్రీనివాస్ చేతిలో ప్రస్తుతం హైందవం, టైసన్ నాయుడు సినిమాలు ఉన్నాయి.