Bellamkonda Sreenivas : మహేష్ బాబు కంటే ముందే బెల్లం బాబు.. ఆ హీరోలు కూడా..

ఈ ఫస్ట్ లుక్ లో మహేష్ ఎద్దుపై కూర్చొని త్రిశూలం పట్టుకొని ఉగ్రంగా విలన్స్ మీదకు వెళ్లినట్టు ఉంది. (Bellamkonda Sreenivas)

Bellamkonda Sreenivas : మహేష్ బాబు కంటే ముందే బెల్లం బాబు.. ఆ హీరోలు కూడా..

Bellamkonda Sreenivas

Updated On : November 19, 2025 / 11:31 AM IST

Bellamkonda Sreenivas : ఇటీవల మహేష్ బాబు – రాజమౌళి వారణాసి సినిమా టైటిల్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్లో టైటిల్ గ్లింప్స్ తో పాటు మహేష్ బాబు ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసారు. ఈ ఫస్ట్ లుక్ లో మహేష్ ఎద్దుపై కూర్చొని త్రిశూలం పట్టుకొని ఉగ్రంగా విలన్స్ మీదకు వెళ్లినట్టు ఉంది. ఈ పోస్టర్ వైరల్ గా మారడంతో మహేష్ లుక్ అదిరింది అని ఫ్యాన్స్ సంతోషించారు.(Bellamkonda Sreenivas)

అయితే పలువురు నెటిజన్లు ఇది మా బెల్లం బాబు ఎప్పుడో చేసేసాడు అని అంటున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ సాక్ష్యం సినిమాలో ఎద్దు మీద కూర్చొని త్రిశూలం పట్టుకొని విలన్ మీదకు వెళ్తాడు. ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ వీడియో షేర్ చేస్తూ మహేష్ కంటే ముందే బెల్లం బాబు చేసాడు ఈ సీన్ అని అంటున్నారు.

Also Read : Nithiin : హిట్ కొట్టడానికి నితిన్ సరికొత్త ప్లాన్.. సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్.. ఇదైనా వర్కౌట్ అయితే బాగుండు..

గతంలో పవన్ కళ్యాణ్ బంగారం సినిమాలో, ఇటీవల గోపీచంద్ భీమా సినిమాలో ఎద్దుల మీద కూర్చొని వచ్చిన సీన్స్ ఉన్నాయి. ఇక ఎద్దుతో ఫైట్ అయితే చిరంజీవి, నాగార్జున.. పలువురు హీరోలు ఎప్పుడో చేసేసారు. అయితే అచ్చు గుద్దినట్టు మహేష్ లాగే బెల్లంబాబు కూడా ఎద్దు మీద త్రిశూలం పట్టుకొని రావడంతో ఈ వీడియో వైరల్ గా మారింది.

 

Also Read : Senior Actress : మూడేళ్లకే సినిమాల్లోకి వచ్చిన నటి.. ఇప్పుడు సంచలన నిర్ణయం.. మిగిలిన జీవితం ఆయనకు అంకితం..

Bellamkonda Sreenivas Done This Scene Before Mahesh Babu Varanasi Movie Video goes Viral