Nithiin : హిట్ కొట్టడానికి నితిన్ సరికొత్త ప్లాన్.. సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్.. ఇదైనా వర్కౌట్ అయితే బాగుండు..
నితిన్ ప్రస్తుతానికి ఇంకా ఏ సినిమాని ప్రకటించలేదు. (Nithiin)
Nithiin
Nithiin : నితిన్ హిట్ కొట్టడానికి చాలా ప్రయత్నిస్తున్నాడు. నితిన్ కెరీర్ మొదటి నుంచి ఎత్తు పల్లాలే. రెండు హిట్స్ వచ్చాయంటే వరుస ఫ్లాప్స్ పడతాయి. తను చేసే సినిమాల కోసం నితిన్ ఎంత కష్టపడినా ఫలితం మాత్రం దక్కట్లేదు. నితిన్ చివరగా రంగ్ దే సినిమాతో హిట్ కొట్టాడు. ఆ తర్వాత మ్యాస్ట్రో, మాచర్ల నియోజకవర్గం. ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్, రాబిన్ హుడ్, తమ్ముడు.. వరుసగా ఫ్లాప్స్ చూసాడు. తమ్ముడు సినిమా బాగున్నా కమర్షియల్ గా వర్కౌట్ అవ్వలేదు. దీంతో నితిన్ ఒక హిట్ సినిమా కోసం ఎదురుచూస్తున్నాడు.(Nithiin)
నితిన్ ప్రస్తుతానికి ఇంకా ఏ సినిమాని ప్రకటించలేదు. బలగం వేణు దర్శకత్వంలో ఎల్లమ్మ సినిమా చేస్తాడని రూమర్స్ వచ్చాయి కానీ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఇటీవల డైరెక్టర్ VI ఆనంద్ నితిన్ తో సినిమా చేస్తున్నాను అని ఓ ఈవెంట్లో తెలిపాడు. అయితే తాజాగా నితిన్ నెక్స్ట్ సినిమా గురించి ఓ రూమర్ వైరల్ గా మారింది.
Also Read : Senior Actress : మూడేళ్లకే సినిమాల్లోకి వచ్చిన నటి.. ఇప్పుడు సంచలన నిర్ణయం.. మిగిలిన జీవితం ఆయనకు అంకితం..
నితిన్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఇష్క్ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారట. నితిన్ కెరీర్ కి సెకండ్ ఇన్నింగ్స్ లాగా బూస్ట్ ఇచ్చిన సినిమా ఇష్క్. అప్పటిదాకా వరుసగా పది ఫ్లాప్స్ చూసిన నితిన్ ఇష్క్ సినిమాతో భారీ హిట్ కొట్టాడు. నితిన్, నిత్య మీనన్ జంటగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇష్క్ సినిమా 2012 లో రిలీజయింది. అనూప్ రూబెన్స్ ఇచ్చిన మ్యూజిక్, పాటలు ఈ సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. అప్పట్లో 7 కోట్లు పెట్టి తీస్తే ఈ సినిమా ఏకంగా 20 కోట్లు కలెక్ట్ చేసింది.
తాజాగా నితిన్, విక్రమ్ కుమార్, అనూప్ రూబెన్స్ కలిసి ఓ ఫోటో దిగారు. వీరు ముగ్గురు కలిసి తీసుకున్న సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇష్క్ సినిమా సీక్వెల్ కోసం కలిసారని, ఆ సినిమా కోసమే డిస్కస్ చేస్తున్నారని సమాచారం. ఇష్క్ 2 ప్లాన్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు టాలీవుడ్ టాక్. అందుకే ఈ మీటింగ్ అని తెలుస్తుంది. దీంతో ఇష్క్ 2 సినిమా ఓకే అయితే నితిన్ గ్యారెంటీ హిట్ కొడతాడు అని, హిట్ కోసమే నితిన్ ఈ ప్లాన్ చేస్తున్నాడని భావిస్తున్నారు. ఏదైతే ఏముంది బాగా కష్టపడే హీరోల్లో నితిన్ ఒకరు. అలాంటి హీరో హిట్ కొట్టాలి అని అంతా అనుకుంటున్నారు. మరి ఇష్క్ 2 సినిమాపై అధికారిక ప్రకటన ఎప్పుడొస్తుందో.

Also Read : Nayanthara : వామ్మో.. నయనతారకు ఖరీదైన కార్ కొనిచ్చిన భర్త.. దీని ధర ఎన్ని కోట్లో తెలుసా?
