Bigg Boss Elimination : అనవసరంగా పంపించేశారుగా.. బిగ్ బాస్ నుంచి బెజవాడ బేబక్క ఎలిమినేట్.. బేబక్క ఎమోషనల్ పోస్ట్..
ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉండగా నిన్న ఆదివారం ఎపిసోడ్ లో బేబక్కని ఎలిమినేట్ చేసారు.
- Saketh U
- Updated on- September 9, 2024 / 07:06 AM IST
Bezawada Bebakka Eliminated on First Week from Bigg Boss Telugu Season 8
Bigg Boss Elimination : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అప్పుడే మొదటివారం అయిపోయింది. మొదటివారంలో ఎక్కువ ఎంటర్టైన్మెంట్ లేకపోయినా గొడవలు, ఏడుపులతో బాగానే సాగింది. మొదటివారం నామినేషన్స్ లో బేబక్క, నాగ మణికంఠ, సోనియా, విష్ణుప్రియ, పృథ్వి, శేఖర్ భాష.. ఇలా ఆరుగురు కంటెస్టెంట్స్ ఉండగా నిన్న ఆదివారం ఎపిసోడ్ లో బేబక్కని ఎలిమినేట్ చేసారు.
సింగర్ గా గుర్తింపు తెచ్చుకున్న బేబక్క అలియాస్ మధూ ఆ తర్వాత సోషల్ మీడియాలో కామెడీ రీల్స్ చేస్తూ బాగా వైరల్ అయింది. మధూ బెజవాడ బేబక్క అనే పేరుతో సోషల్ మీడియాలో పాపులారిటీ తెచ్చుకుంది. ఆ పాపులారిటీతో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే హౌస్ లో ఎవరికీ తెలియని వాళ్ళు, అసలు యాక్టివ్ లేని వాళ్ళు ఉన్నా బేబక్కని మొదటివారమే పంపించేయడంతో ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు.
Also Read : Prabhas : ప్రభాస్ కామెడీ టైమింగ్ మాములుగా లేదుగా.. ఈ వీడియో చూసారా?
అయితే ఆమెతో వారం రోజులే కాంట్రాక్ట్ తీసుకున్నారేమో అందుకే పంపిన్చేస్తున్నారేమో అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. హౌస్ లో ఉన్న చాలా మంది కంటెస్టెంట్స్ కంటే బేబక్క చాలా బెటర్ అని, అయినా ఆమెని మొదటి వారమే పంపించేయడంతో రియల్ బిగ్ బాస్ ఫ్యాన్స్ విమర్శలు చేస్తున్నారు. ఇక తను బిగ్ బాస్ నుంచి వెళ్లిపోవడంతో సోషల్ మీడియాలో.. బిగ్ బాస్ తో నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. కానీ ఆ జర్నీ అయిపోయింది. నాకు సపోర్ట్ చేసిన వారందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు మరో కొత్త అధ్యాయం మొదలవుతుంది అని ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది.
