Bhairava Dweepam : బాలయ్య అభిమానులకు బ్యాడ్‌న్యూస్.. ఆ సినిమా రీ రిలీజ్ మళ్లీ వాయిదా..
నందమూరి నటసింహం బాలకృష్ణ (Balakrishna) కెరీర్‌ను మలుపు తిప్పిన చిత్రాల్లో భైరవ ద్వీపం (Bhairava Dweepam) ఒకటి.
- Thota Vamshi Kumar
- Updated on- August 30, 2023 / 04:22 PM IST
Bhairava Dweepam Re Release
Bhairava Dweepam Re Release : నందమూరి నటసింహం బాలకృష్ణ (Balakrishna) కెరీర్‌ను మలుపు తిప్పిన చిత్రాల్లో భైరవ ద్వీపం (Bhairava Dweepam) ఒకటి. రోజా కథానాయికగా నటించగా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 1994లో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అద్భుతమైన కలెక్షన్లు సాధించడమే కాకుండా 9 నంది అవార్డులను గెలుచుకుంది.
Kalki 2898 AD : ప్రభాస్ ‘కల్కి’ సంక్రాంతికి వస్తుందా..? నిర్మాత అశ్వినీ దత్ ఏం చెప్పాడు..?
బాలకృష్ణ సినీ జగత్తులో 50వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా భైరవ ద్వీపం చిత్రాన్ని 4K వర్షన్లో రీ రిలీజ్ చేయనున్నట్లు క్లాప్స్ ఇన్ఫోటైన్మెంట్ సంస్థ వెల్లడించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమా రీ రిలీజ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదుచూస్తుండగా మరోసారి వారికి నిరాశే ఎదురైంది. మొదట ఈ సినిమాని ఆగస్టు 5న రీ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే.. కొన్ని కారణాల వల్ల ఆగస్టు 30కి వాయిదా వేశారు.
Jailer : జైలర్ సినిమాకు ఊహించని షాక్.. కలెక్షన్లపై పడనున్న ఎఫెక్ట్..!
అయితే.. ఈ రోజు(బుధవారం ఆగస్టు 30న) కూడా సినిమాని రీ రిలీజ్ చేయలేదు. ఇందుకు గల కారణాలను వివరిస్తూ ఓ నోట్‌ను విడుదల చేశారు. ‘భైరవద్వీపం సినిమాను 4కె రిజల్యూషన్‌తో మీ అందరి ముందుకు ఈ రోజు తీసుకురావాలని ఎంతో ప్రయత్నించాం. అయితే.. ఈ చిత్రంలోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు 4కెలో పూర్తి స్థాయిలో మారలేదు. చిత్ర ఔట్ పుట్ పట్ల మేము సంతోషంగా లేము. మంచి ఔట్ పుట్ కోసం ప్రయత్నిస్తున్నాం. అందుకనే రీ రిలీజ్‌ను వాయిదా వేస్తున్నాం. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తాం.’ అంటూ ఆ నోట్లో పేర్కొన్నారు.
