Bhala Thandhanana: ఓటీటీ పార్ట్‌నర్‌ను లాక్ చేసుకున్న ‘భళా తందనాన’!
యంగ్ హీరో శ్రీవిష్ణు ఎంచుకునే సినిమాలు వైవిధ్యంగా ఉంటాయనే ఒక టాక్ ఇండస్ట్రీలో బలంగా ఉంది. దీంతో అతడు చేసే సినిమాలను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిని...
- Anil Aaleti
- Published On : May 6, 2022 / 01:32 PM IST
Bhala Thandhanana Locks Ott Streaming Partner
Bhala Thandhanana: యంగ్ హీరో శ్రీవిష్ణు ఎంచుకునే సినిమాలు వైవిధ్యంగా ఉంటాయనే ఒక టాక్ ఇండస్ట్రీలో బలంగా ఉంది. దీంతో అతడు చేసే సినిమాలను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిని చూపుతుంటారు. రిజల్ట్‌తో సంబంధం లేకుండా శ్రీవిష్ణు చేసే సినిమాలకు ప్రేక్షకుల నుండి రెస్పాన్స్ దక్కుతూ ఉంటుంది. తాజాగా ఆయన నటించిన ‘భళా తందనాన’ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పూర్తిగా డబ్బు చుట్టూ తిరిగే కథ కావడంతో ఈ సినిమాలో శ్రీవిష్ణు ఎలాంటి స్టఫ్ పట్టుకొస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
Bhala Thandhanana : రాక్షసుణ్ణి చంపడానికి దేవుడు కూడా అవతారాలెత్తాలి..
ఇక ఈ సినిమాలో శ్రీవిష్ణు మరోసారి తనదైన యాక్టింగ్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది. ఈ సినిమాలో శ్రీవిష్ణు సరసన అందాల భామ కేథరిన్ త్రేజా నటిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తుండగా, ఈ సినిమా ఓటీటీ పార్ట్‌నర్‌ను లాక్ చేసుకుని అందరికీ షాకిచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం డిస్నీప్లస్ హాట్‌స్టార్ ‘భళా తందనాన’ చిత్రాన్ని ఓటీటీ స్ట్రీమింగ్ చేసేందుకు సిద్ధమయ్యింది.
Bhala Thandanana: శ్రీవిష్ణుకు జక్కన్న సపోర్ట్.. ఈసారైనా హిట్టు కొడతాడా?
అయితే ఈ నెలాఖరు వరకు ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు డిస్నీప్లస్ హాట్‌స్టార్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్ర శాటిలైట్ రైట్స్‌ను స్టార్ మా సొంతం చేసుకుంది. ఈ సినిమాలో శ్రీవిష్ణు పాత్ర అల్టిమేట్‌గా ఉంటుందని చిత్ర యూనిట్ అంటోంది. వారాహి చలన చిత్రం బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాలో రాంచంద్ర రాజు, సత్య, శ్రీనివాస్ రెడ్డి, పోసాని తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మరి ఈ సినిమాను డిస్నీప్లన్ హాట్ స్టార్ ఎప్పుడు స్ట్రీమింగ్ చేస్తుందో చూడాలి.
