Bheemla Nayak: లాలా భీమ్లా.. జనవరిలోనా.. వాయిదానా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో క్రేజీ మాస్ రీమేక్ అయ్యప్పనుమ్ కోషియం రీమేక్ కూడా ఒకటి. రానా దగ్గుబాటి కూడా కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాపై..
- Naresh Mannam
- Published On : November 13, 2021 / 03:06 PM IST
Bheemla Nayak
Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో క్రేజీ మాస్ రీమేక్ అయ్యప్పనుమ్ కోషియం రీమేక్ కూడా ఒకటి. రానా దగ్గుబాటి కూడా కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాపై ఒక్కో అప్డేట్ అండ్ పోస్టర్స్ తో మేకర్స్ అంతకు మించిన హైప్ తీసుకురవడంతో సినిమాపై హీట్ పెరుగుతూ వచ్చింది. అందుకు తగ్గట్లే మేకర్స్ కూడా సాధ్యమైనంత త్వరగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని వచ్చే సంక్రాంతికి డేట్ ఇచ్చేశారు.
Unstoppable with NBK: రౌడీ హీరోతో స్పెషల్ ఎపిసోడ్.. ఇది వేరే లెవెల్!
సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా విడుదల చేయనున్నట్లు మొన్నటి వరకు ధీమాగా ఉన్న భీమ్లా మేకర్స్ ఇప్పుడు డైలమాలో పడ్డట్లుగా ప్రచారం జరుగుతుంది. దానికి కారణం ఆర్ఆర్ఆర్.. రాధేశ్యామ్. వారం ముందుగానే దిగిపోనున్న ఆర్ఆర్ఆర్ కబ్జా మామూలుగా ఉండదని ఇప్పటికే తేలిపోయింది. కొద్దో గొప్పో మిగిలినా వెనక రాధేశ్యామ్ అది భర్తీ చేయడం ఖాయం. అందుకే మిగతా సినిమాలన్నీ ఈ సంక్రాంతికి వెనక్కి తగ్గడమే బెటర్ గా ఫీలవుతున్నాయి.
Maha Samudram : ఓటిటిలో ‘మహా సముద్రం’
అయితే, భీమ్లా నాయక్ మాత్రం వెనక్కి తగ్గాలా ముందుకు వెళ్లాలా అన్న డైలమాలో కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. దర్శకుడు సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకోగా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలు పెట్టనున్నారు. అయితే, విడుదలకి సంబంధించి మాత్రం ఇంకా సరైన క్లారిటీ రావాల్సి ఉంది. జనవరి రేస్ నుంచి తప్పుకొని ఫిబ్రవరిలో రిలీజ్ అవ్వవచ్చని గాసిప్స్ వినిపిస్తుండగా మేకర్స్ మాత్రం కన్ఫ్యూజన్ లో ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి అనుకున్నట్లే జనవరిలో వస్తాడా.. లేక వాయిదా వేసుకుంటారా అన్నది చూడాల్సి ఉంది.
