Bhola shankar : మెగాస్టార్ చిరంజీవితో వివాదం.. స్పందించిన భోళాశంకర్ నిర్మాత.. రూమర్స్‌కు చెక్
మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం భోళా శంకర్. ఈ చిత్ర పారితోషికం విషయంలో చిరంజీవి పట్టుబట్టారని, దీంతో నిర్మాత అనిల్ సుకంర తన ఇల్లు, ఆస్తులను విక్రయించాల్సి వచ్చిందనే వార్త గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
- Thota Vamshi Kumar
- Updated on- August 17, 2023 / 07:52 PM IST
Anil Sunkara-Chiranjeevi
Bhola shankar producer : మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటించిన చిత్రం భోళా శంకర్ (Bhola shankar). మెహర్ రమేష్(Meher Ramesh) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో తమన్నా(Tamannaah) హీరోయిన్. మహతి స్వరసాగర్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని సొంతం చేసుకోలేకపోయింది. ఇదిలా ఉంటే.. ఈ చిత్ర పారితోషికం విషయంలో చిరంజీవి పట్టుబట్టారని, దీంతో నిర్మాత అనిల్ సుకంర తన ఇల్లు, ఆస్తులను విక్రయించాల్సి వచ్చిందనే వార్త గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
Skanda Songs : ‘స్కంద’ సెకండ్ సాంగ్ రిలీజ్.. ‘గందరాబాయి’ అంటూ రామ్, శ్రీలీల మాస్ డాన్స్..
ఇప్పటికే దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ స్పందించగా తాజాగా నిర్మాత అనిల్ సుంకర సైతం స్పందించారు. అవన్నీ వట్టి రూమర్లు మాత్రమేనని చెప్పారు. ఇక చిరంజీవి అన్ని విధాలుగా సహకరించారని, తనకు చిరుకు మధ్య సినిమాల పరంగానే కాక, వ్యక్తిగతంగానూ మంచి స్నేహం ఉందన్నారు. నిజాలు కప్పిపెట్టి, విద్వేషపూరిత వార్తలను దయ చేసి వ్యాప్తి చేయవద్దని కోరారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ ట్వీట్ చేశారు.
Chandramukhi 2 : ఎంఎం కీరవాణి లీక్స్.. చంద్రముఖి-2లో 10 పాటలు..!
“పుకార్లు అనేవి కొంతమంది వ్యక్తులకు క్రూరమైన వినోదాన్ని పంచవచ్చు. అయితే..ఎంతో కాలం కష్టపడి పైకి వచ్చిన వారి ప్రతిష్టను దెబ్బతీయడం అనేది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. ఇది తీవ్రమైన నేరం. ఇలాంటి రూమర్ల వల్ల వారి కుటుంబాలు తీవ్రమైన ఒత్తిడి, ఆందోళనకు గురి అవుతుంటాయి. ఇక నాకు, చిరంజీవికి మధ్య గొడవలు జరిగాయని వచ్చిన వార్తల్లో నిజం లేదు. ఆయన పూర్తిగా మద్దతు ఇచ్చారు. సినిమాల పరంగానే కాదు వ్యక్తిగతంగాను మా ఇద్దరి మధ్య చాలా మంచి స్నేహం ఉంది. వాస్తవాలను కప్పి పెట్టి విద్వేషపూరిత వార్తలను దయచేసి ప్రసారం చేయవద్దు. నకిలీ వార్తలను సృష్టించడం కొంతమందికి సాధారణ వినోదంగా ఉండవచ్చు, కానీ అందులో భాగస్వాములై ఉన్న వ్యక్తులకు చిక్కులను కలిగిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో నాకు అండగా నిలిచిన పరిశ్రమలోని నా శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు. మీ అందరి ఆశీస్సులతో తిరిగి బలంగా రావాలని కోరుకుంటున్నాను. “అని నిర్మాత అనిల్ సుంకర ట్వీట్ చేశారు.
Nayanthara : షారుక్ ఖాన్ కోసం మనసు మార్చుకున్న నయన్..? ఏ విషయంలోనంటే..?
