Big B: పొలాండ్ నుంచి ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు కొనుగోలు చేసిన బిగ్ బీ, బీఎంసీకి వెంటిలేటర్ల విరాళం
బిగ్ బీ.. బాలీవుడ్ సూపర్ స్టార్ అమిత్ బచ్చన్ కొవిడ్ బాధితులకు సహాయార్థంగా అడుగు ముందుకేశారు. పోలాండ్ నుంచి 50ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను, వెంటిలేటర్లను కొనుగోలు చేసి..
- Subhan Ali Shaik
- Updated on- May 15, 2021 / 03:10 PM IST
Big B Buys Oxygen Concentrators From Poland Donates Ventilators To Bmc
Big B: బిగ్ బీ.. బాలీవుడ్ సూపర్ స్టార్ అమిత్ బచ్చన్ కొవిడ్ బాధితులకు సహాయార్థంగా అడుగు ముందుకేశారు. పోలాండ్ నుంచి 50ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను, వెంటిలేటర్లను కొనుగోలు చేసి బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)కి విరాళంగా ఇచ్చారు.
పొలాండ్ ప్రభుత్వ ఔన్నత్యానికి కృతజ్ఞతలు. ఇండియాకు కాన్సన్‌ట్రేటర్లను, వెంటిలేటర్లు చేరేందుకు సహాయం చేసిన అక్కడ పెద్దలకు థ్యాంక్స్ చెబుతున్నా. ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్ల అత్యవసరం ఉందని కాల్ చేస్తే ఇంత కీలకమైన పరిస్థితుల్లోనూ వాటిని ఏర్పాటు చేశారు. ఇండియన్ కాన్సుల్ లో ఉన్న నా స్నేహితుడికి చెప్పగానే Wroclaw సిటీ మేయర్ వీటికి సహాయం చేశారు.
పాలిష్ కంపెనీ ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను తయారుచేసి ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేస్తుంది. నాకు అవసరం ఉన్న వాటిల్లో ఇవి ఒకటి. వెంటనే నేను 50ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను, వెంటిలేటర్లకు ఆర్డర్ పెట్టాను. ప్రొడక్షన్ అనేది అంత తక్కువ ఉన్నా.. నా కోసం ఏర్పాటు చేశారు. వాటిని మే 15వరకూ ఇక్కడకు వచ్చేస్తాయి.
మరో చోట నుంచి ఇంకా 60 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు రాబోతున్నాయి. వీటిని అవసరమైన వారికి అందించాలని ముంబై మునిసిపల్ కార్పొరేషన్ కు రిక్వెస్ట్ చేస్తున్నా. ఆర్థిక సాయం ఇస్తానంటే వద్దని వెంటిలేటర్లను ఏర్పాటు చేయమన్నారు. ఈ టాస్క్ కష్టంగా అనిపించినా ఓ ఏజెన్సీ ద్వారా సాధ్యపడింది. 20 ఆర్డర్ ఇస్తే 10 ఇప్పటికే వచ్చేశాయి. మరో 10 వెంటిలేటర్లు 25వ తేదీ వరకూ చేరుకుంటాయి.
