Bigg Boss 4: లాస్య ఎలిమినేషన్!

  • Publish Date - November 21, 2020 / 08:49 PM IST

Bigg Boss 4 – Lasya Elimination: కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్‌బాస్ సీజన్ 4 తెలుగు వారం వారం మరింత హైప్ పెంచుతూ కొనసాగుతోంది. కంటెస్టెంట్స్ అందరూ పోటీపడి మరీ ఆడియెన్స్‌ను ఎంటర్‌‌టైన్ చేస్తున్నారు. ఇక ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయం తెలిసిపోయింది.


మోనాల్, లాస్య, అభిజిత్, సోహైల్, హారిక, ఆరియానా ఈ వీక్ ఎలిమినేషన్ కోసం నామినేట్ అయ్యారు. అయితే లాస్య, మోనాల్ ఇద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారని, లేదు ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.
కట్ చేస్తే ఈ వారం లాస్య ఇంటినుండి బయటకొచ్చేసిందని తెలుస్తోంది. నిన్నటి వరకు లాస్యనే విన్నర్‌గా నిలుస్తుందనే వార్తలు వినిపించాయి. ఇంతలో ఆమె ఎలిమినేట్ అయిందనే మాట విన్న లాస్య అభిమానులు షాక్ తిన్నారు. ఓటింగ్స్‌తో పాటు ఆమె ఎలిమినేషన్‌కు గల కారణాలు ఏంటనే వివరాలు మరికాసేపట్లో తెలియనున్నాయి.