Shashwat Sachdev: రామ్ చరణ్ సినిమాకు దురంధర్ మ్యూజిక్ డైరెక్టర్.. క్రేజీ కాంబో సెట్
రామ్ చరణ్ చేస్తున్న సినిమాకు మ్యూజిక్ అందించే అవకాశాన్ని దక్కించుకున్నాడు దురంధర్ మూవీ సంగీత దర్శకుడు శశ్వత్ సచ్దేవ్(Shashwat Sachdev).
shashwat sachdev giving music for ram charan movie
- దురంధర్ మ్యూజిక్ డైరెక్టర్ కి బంపర్ ఆఫర్
- రామ్ చరణ్ సినిమాకు పని చేసే అవకాశం
- త్వరలోనే అధికారిక ప్రకటన
Shashwat Sachdev: బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ దురంధర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే, ఈ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. కేవలం సింగల్ లాన్గ్వేజ్ లో విడుదల అయ్యి ఏకంగా రూ.1400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది అంటే మామలు విషయం కాదు. బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది ఈ సినిమా. వాస్తవ సంఘటన ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా ఆడియన్స్ ను ఒక రేంజ్ లో మెప్పించింది.
ఇటీవల ఓటీటీలో విడుదలైన ఈ సినిమాకు అక్కడ కూడా బ్రహ్మరధం పడుతున్నాడు ఆడియన్స్. అందుకే, ఈ సినిమా విషయంలో దర్శకుడు ఆదిత్య ధర్, హీరో రణ్వీర్ సింగ్ లకు ప్రశంసలు దక్కాయి. వివర్శకులు సైతం ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. అయితే, ఈ సినిమా విషయంలో మరొకరి గురించి కూడా తప్పకుండా మాట్లాడుకోవాలి. అతనే, మ్యూజిక్ డైరెక్టర్ శశ్వత్ సచ్దేవ్(Shashwat Sachdev). ఈ సినిమాకు తన మ్యూజిక్ తో ప్రాణం పోశాడు ఈ సంగీత దర్శకుడు.
SSS OTT: డైరెక్టర్ ఓటీటీలోకి శివాజీ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?
ఇక పాటలు కూడా ఎంత పెద్ద విజయాన్ని సాధించాయి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలా దురంధర్ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాడు శశ్వత్ సచ్దేవ్. దాంతో, ఈ సంగీత దర్శకుడికి ఒక రేంజ్ లో డిమాండ్ ఏర్పడింది. స్టార్ హీరోలు సైతం అతనితో పని చేసేందుకు ఇష్టపడుతున్నారు. ఈ నేపధ్యంలో తెలుగులో కూడా తన డెబ్యూ చేయబోతున్నాడట ఈ సంగీత తరంగం. అవును, అది కూడా రామ్ చరణ్ సినిమాకి.
అయితే, హీరోగా చేస్తున్న సినిమాకు కాదు నిర్మాతగా చేస్తున్న సినిమాకి. రామ్ చరణ్ నిర్మాతగా హీరో నిఖిల్ సిద్దార్థ్ తో ది ఇండియా గేట్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. చాలా కాలం క్రితమే ఈ సినిమాపై అధికారిక ప్రకటన వచ్చింది. పాన్ ఇండియా లెవల్లో పీరియాడిక్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాకుక్ మ్యూజిక్ అందించే అవకాశం శశ్వత్ సచ్దేవ్ కి దక్కిందట. ప్రస్తుతం ఈ న్యూస్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇదే విషయాన్ని త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారట మేకర్స్. కేవలం ఈ సినిమానే కాదు మరో రెండు తెలుగు సినిమాలకు కూడా మ్యూజిక్ అందించనున్నాడట శశ్వత్ సచ్దేవ్.
