Big Boss 4 Winner: అభిజిత్‌కు అనారోగ్య కారణాలు.. అందుకే సినిమాలకు దూరం!
సినీ నటుడు, తెలుగు బిగ్ బాస్ నాలుగో సీజన్ విజేత అభిజిత్ గురించి అందరికి తెలిసిందే. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన అభిజిత్ ఆ తర్వాత ఏ సినిమాలలో కూడా..
- Naresh Mannam
- Updated on- September 15, 2021 / 11:26 AM IST
Big Boss 4 Winner
Big Boss 4 Winner: సినీ నటుడు, తెలుగు బిగ్ బాస్ నాలుగో సీజన్ విజేత అభిజిత్ గురించి అందరికి తెలిసిందే. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన అభిజిత్ ఆ తర్వాత ఏ సినిమాలలో కూడా ఒక్క అవకాశం కూడా అందుకోలేదు. పూర్తిగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న అభిజిత్ కు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ లో తనేంటో నిరూపించుకునే అవకాశం వచ్చింది. దక్కిన అవకాశాన్ని మిస్టర్ కూల్‌తో పాటు మిస్టర్ పర్‌ఫెక్ట్‌గా కండబలంతో కాకుండా బుద్ది బలంతో గేమ్ ఆడి సీజన్ విజేతగా నిలిచాడు.
Met Gala 2021: న్యూయార్క్ ఫ్యాషన్ షోలో మెరిసిన మేఘా కృష్ణారెడ్డి సతీమణి!
బిగ్‌బాస్ షోతో అభిజిత్ టైటిల్ ని మాత్రమే కాదు ఎంతోమంది అభిమానాన్ని కూడా సంపాదించుకున్నాడు. ఇక బిగ్ బాస్ తర్వాత అభిజిత్ కెరీర్ మొత్తం మలుపు తిరుగుతుందని అందరూ అనుకున్నారు. అభిజిత్ విజేతగా నిలిచిన సీజన్ లోనే మిగతా కంటెస్టెంట్లు కొందరు వరుస ప్రాజెక్టులలో అవకాశాలు అందుకొని బిజీగా మారినా అభిజిత్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. మూడు ప్రాజెక్టులకు సైన్ చేసినట్లుగా ఆ మధ్య అభిజిత్ ప్రకటించినా కారణాలేమైనా అవి కూడా పట్టాలెక్కలేదు. దీంతో అభిజిత్ ఎక్కడ ఉన్నాడు.. ఏమైంది అన్నది చాలాకాలంగా సస్పెన్స్ గా నడుస్తూ వస్తుంది.
PV Sindhu Biopic: దీపికా మరో క్రేజీ ఫిల్మ్.. సిల్వర్ స్క్రీన్ మీద సింధు సక్సెస్ స్టోరీ!
అయితే, తాజాగా ట్విట్టర్‌లో ‘ఆస్క్ మి ఎనీథింగ్’ అనే సెషన్‌ను నిర్వహించాడు అభిజిత్. దీంతో అభిమానుల నుండి కూడా అవే ప్రశ్నలు కుప్పలు తెప్పలుగా ఎదురయ్యాయి. తన సినిమా అప్‌డేట్ గురించి చెప్పాల్సిందిగా పలువురు అభిమానులు ప్రశ్నల వర్షం కురిపించడంతో అభిజిత్ కూడా స్పందించాడు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగోలేకపోవడంతోనే సినిమాలు చేయట్లేదని చెప్పి అందరికి షాక్ ఇచ్చాడు. ఈ సందర్భంగా తాను ఒక్కటే చెప్పదలచుకున్నానన్న అభిజిత్.. ఇప్పుడు తనకు ఆరోగ్యమే ఎక్కువ ముఖ్యం అని తెలిపాడు. అయితే తనకు గల అనారోగ్య సమస్యలపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.
