Bigg Boss 5 Trp
Bigg Boss 5 Telugu: ‘కింగ్’ నాగార్జు స్మాల్ స్క్రీన్ ఆడియన్స్‌ని ఎంతలా ఆకట్టుకోగలరే ఇంతకుముందు ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షో తో ప్రూవ్ అయింది. ‘బిగ్ బాస్’ తెలుగు సీజన్ 3 తో హోస్ట్‌గా తనకు తిరుగుండదనిపించుకున్నారు. దీంతో నాలుగు, ఇప్పుడు 5వ సీజన్ కూడా ఆయనే హోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నారు.
Bigg Boss 5 : ఈసారి టఫ్ అండ్ ఛాలెంజింగ్‌గా అనిపించింది – ‘కింగ్’ నాగార్జున..
టీవీ షో అంటే నేరుగా ప్రేక్షకుల ఇంటిలోకే వెళ్లే వీలుంటుంది. వారిని మెప్పించేలా హోస్ట్ చేస్తే కనుక టిఆర్‌పీకి తిరుగుండదసలు. ‘బిగ్ బాస్’ 3, 4 సీజన్ల మాదిరిగానే సీజన్ 5 తోనూ అదరిపోయే టిఆర్‌పీ రేటింగ్స్ రాబట్టారు ‘కింగ్’. ‘బిగ్ బాస్’ లాంచింగ్ ఎపిసోడ్ (TRP 15.71), 18 TVR.. మార్కెట్‌లో అత్యధికంగా 1303 జీఆర్‌పీ (గ్రాస్ రేటింగ్ పాయింట్) తో సెన్సేషన్ క్రియేట్ చేశాడు ‘బిగ్ బాస్’.
Bangarraju : ‘బంగార్రాజు’ స్టార్ట్ అయ్యాడు.. ఆనందంలో అక్కినేని అభిమానులు..
‘బిగ్ బాస్ 5’ వ సీజన్‌ను ఇంతలా ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు, స్టార్ మా మరియు బిగ్ బాస్ టీంకి విషెస్ తెలుపుతూ ట్వీట్ చేశారు నాగార్జున. సినిమాల విషయానికొస్తే.. ‘వైల్డ్ డాగ్’ తర్వాత స్టైలిష్ ఫిలిం మేకర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ‘ది ఘోస్ట్’ మూవీ చేస్తున్నారు. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ ప్రీక్వెల్ ‘బంగార్రాజు’ లో తనయుడు నాగ చైతన్యతో కలిసి నటిస్తున్నారు నాగార్జున.
Thank you all for 5 much Love!!!❤️❤️❤️❤️❤️. You made Starmaa the unbeatable No 1 with BiggBoss Season 5 launch. #BiggBossTelugu5 @starmaa pic.twitter.com/x0iPYwCoUH
— Nagarjuna Akkineni (@iamnagarjuna) September 16, 2021