Annapurna Thalli Buvvamma : డొక్కా సీతమ్మ జీవిత కథపై మరో సినిమా..

డొక్కా సీతమ్మ కథతో ఈ సినిమా నిర్మిస్తున్నారు.

  • Published By: Saketh Nill ,Published On : August 13, 2025 / 12:45 PM IST
Annapurna Thalli Buvvamma : డొక్కా సీతమ్మ జీవిత కథపై మరో సినిమా..

Annapurna Thalli Buvvamma

Updated On : August 13, 2025 / 12:45 PM IST

Annapurna Thalli Buvvamma : సముద్ర, శివిక, కుసుమ, సుప్రియ, నవీన్‌ మట్టా, రోహిల్‌, ఆదిల్‌, రూపేష్‌.. పలువురు కీలక పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ‘అన్నపూర్ణ తల్లి బువ్వమ్మ’. గోరి బ్రదర్స్‌ మీడియా, బ్లాక్‌ అండ్‌ వైట్‌ మూవీ మార్క్‌ బ్యానర్స్ పై సిరాజ్‌ ఖాదరన్‌ గోరి నిర్మాణంలో సురేష్‌ లంకలపల్లి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. డొక్కా సీతమ్మ కథతో ఈ సినిమా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్‌ పూర్తవడంతో ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

ఈ ఈవెంట్లో బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. అన్నపూర్ణమ్మ అయిన డొక్కా సీతమ్మ గారి గురించి ఇంతకు ముందు ఎవరికీ పెద్దగా తెలీదు. పవన్‌ కళ్యాణ్ వల్ల ఆమె పేరు ఇప్పుడు అందరికీ తెలిసింది. ఏ సమయంలో అయినా ఆమె వండి వార్చి వడ్డించేదని చెబుతుంటారు. అలాంటి వ్యకి కథతో సినిమా చేయడం ఆనందంగా ఉంది. ఆంధ్రాలో మధ్యాహ్నం పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టడం హర్షించదగ్గ విషయం. పవన్‌ కళ్యాణ్ గారి స్ఫూర్తితో నేను కూడా ఒంగోలులో డొక్కా సీతమగారి పేరున అన్నదానం మొదలుపెడతాను. ఇలాంటి మంచి సినిమాలు రావాలని అన్నారు.

Also Read : Sandeep Reddy Vanga : ఎవరెవరివో సినిమాలు చూస్తున్నారు.. ఈ సినిమా చూడండి.. నిర్మాత నా LKG దోస్త్..

డొక్కా సీతమ్మ పాత్రధారి శివిక మాట్లాడుతూ.. ఇది నా మొదటి సినిమా. నటిగా లాంచ్‌ అవ్వడానికి ఇంతకన్నా మంచి టీమ్‌ దొరకదు. ఈ పాత్రకు న్యాయం చేశాననే అనుకుంటున్నాను అన్నారు. దర్శకుడు సురేశ్‌ లంకలపల్లి మాట్లాడుతూ.. నా టీమ్‌ బాగా చేసిందని చేను చెప్పను. తెరపై వాళ్ల పెర్‌ఫార్మెన్స్‌ చూసి ప్రేక్షకులే చెబుతారు అని అన్నారు.

అయితే ఇటీవల ఆమని, మురళీమోహన్ ముఖ్య పాత్రల్లో ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ అనే సినిమాని డొక్కా సీతమ్మ బయోపిక్ గా మొదలుపెట్టారు. ఇప్పుడు ఆవిడ కథపై మరో బయోపిక్ వస్తుండటం గమనార్హం.

Also Read : Annapurna Studios : ఈ ఫొటోకు 50 ఏళ్ళు.. హైదరాబాద్ లో సినీ అభివృద్ధికి ఇక్కడే బీజం.. ఈ ఫొటోలో ఉన్న బాబు ఏ హీరోనో తెలుసా?