Rajinikanth : అప్పుడు కొడుకుగా నటించి.. ఇప్పుడు రజినీకాంత్ తోనే వార్ కి సిద్దమైన హీరో..

 రజినీకాంత్ కూలీ సినిమా రేపు ఆగస్టు 14న రిలీజ్ కానుంది.

Rajinikanth : అప్పుడు కొడుకుగా నటించి.. ఇప్పుడు రజినీకాంత్ తోనే వార్ కి సిద్దమైన హీరో..

Rajinikanth

Updated On : August 13, 2025 / 1:43 PM IST

Rajinikanth : రజినీకాంత్ కూలీ సినిమా రేపు ఆగస్టు 14న రిలీజ్ కానుంది. అలాగే రేపు ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ కలిసి నటించిన బాలీవుడ్ సినిమా వార్ 2 కూడా రిలీజ్ కానుంది. ఈ క్రమంలో తాజాగా హృతిక్ రోషన్ స్పెషల్ ట్వీట్ వేసాడు.

హృతిక్ రోషన్ తన ట్వీట్ లో.. మీ పక్కన నటుడిగా నా తొలి అడుగులు వేశాను. నా మొదటి గురువుల్లో మీరొకరు. సినిమాల్లో 50వ వార్షికోత్సవం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా శుభాకాంక్షలు అని రజినీకాంత్ గురించి తెలిపాడు.

Also Read : Anupama Parameswaran : అప్పుడేమో ఛాలెంజింగ్ గా తీసుకుంది.. ఇప్పుడేమో అనవసరంగా చేసాను అంటుంది..

రజినీకాంత్ గతంలో హిందీలో కూడా పలు సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. రజినీకాంత్ – శ్రీదేవి జంటగా బాలీవుడ్ లో 1986 లో భగవాన్ దాదా అనే సినిమా చేసాడు. రాకేష్ రోషన్ నిర్మాణంలో ఓం ప్రకాష్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో రజినీకాంత్ కొడుకుగా హృతిక్ రోషన్ చిన్నప్పుడే నటించాడు. ఇప్పుడు 39 ఏళ్ళ తర్వాత తండ్రిగా నటించిన రజినీకాంత్ సినిమాకు పోటీగా తన వార్ 2 సినిమాతో వస్తున్నాడు హృతిక్.

rajinikanth

ఈ క్రమంలో హృతిక్ రోషన్ రజినీకాంత్ తో పనిచేసిన రోజులను గుర్తుచేసుకొని ఇలా ట్వీట్ చేయడం గమనార్హం.

Also Read : Sandeep Reddy Vanga : ఎవరెవరివో సినిమాలు చూస్తున్నారు.. ఈ సినిమా చూడండి.. నిర్మాత నా LKG దోస్త్..