Bigg Boss 7 Day 3 : ఒక హీరోయిన్‌ని ముద్దు అడిగితే.. మరో హీరోయిన్ పెట్టింది.. మూడోరోజు హైలైట్స్..
బిగ్‌బాస్ సీజన్ 7 మూడోరోజు హైలైట్స్. టేస్టీ తేజ ఒక హీరోయిన్‌ని ముద్దు అడిగితే, మరో హీరోయిన్ పెట్టింది.
- gum 95921
- Published On : September 7, 2023 / 11:25 AM IST
Bigg Boss 7 Day 3 Highlights Tasty Teja Subhasri Shakeela
Bigg Boss 7 Day 3 : నాగార్జున (Nagarjuna) హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ (Bigg Boss) సీజన్ 7 మొదలైన సంగతి తెలిసిందే. ఈసారి 14 మంది కంటెస్టెంట్స్ తోనే స్టార్ట్ అయిన ఈ సీజన్.. మూడోరోజుకి పూర్తి చేసుకుంది. ఫస్ట్ రెండు రోజులు పరిచయాలు, నామినేషన్స్ తో గడిసిపోయిన బిగ్ బాస్.. మూడో రోజు తొలి టాస్క్ తో హోరాహోరీ గేమ్ ఆడించాడు బిగ్ బాస్.
Miss Shetty Mr Polishetty Review : మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ట్విట్టర్ రివ్యూ..
ప్రస్తుతం హోసూరు లోకి ఎంట్రీ ఇచ్చినా.. వారు ఇంకా ఇంటి సభ్యులుగా కన్ఫార్మ్ కాలేదని చెప్పి మొదటిరోజే షాక్ ఇచ్చిన బిగ్ బాస్.. ఇప్పుడు హౌస్ లో ప్లేస్ కన్ఫార్మ్ చేసుకునేందుకు ఒక గేమ్ పెట్టాడు. ‘ఫేస్ ద బీస్ట్’ ఇద్దరు పహిలివానులతో కుస్తీ పోటీ పెట్టాడు. వీరితో పోరాడి బరిలో ఎక్కువ సమయం ఉన్నవారికి ఐదు వారలు ఇమ్యూనిటీ పొందడమే కాకుండా నామినేషన్, ఎలిమినేషన్ నుండి కూడా సేవ్ అవుతారని చెప్పుకొచ్చాడు.
ఇక ఈ పోటీలో ఆట సందీప్, ప్రియాంక, మాత్రమే ఎక్కువ సమయంలో బరిలో నిలిచి విజేతలుగా నిలిచారు. వీరి తరువాత శోభాశెట్టి, పల్లవి ప్రశాంత్, టేస్టీ తేజ దాదాపు 1 నిమిషం పాటు బరిలో నిలవగలిగారు. మిగిలిన వారంతా సెకండ్స్ వ్యవధిలోనే బయటకి వచ్చేశారు. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి కండలు చూపించి ఎక్స్‌పోజ్ చేసిన ప్రిన్స్ కేవలం అరనిమిషం మాత్రమే బరిలో నిలవగలిగాడు.
Jawan Twitter Review : జవాన్ ట్విట్టర్ రివ్యూ.. బాలీవుడ్ బాద్‌షా ఇంకోసారి తన సత్తా చాటాడా?
ఇది ఇలా ఉంటే, ఈ ఎపిసోడ్ లో టేస్టీ తేజ ముద్దు సన్నివేశం హైలైట్ గా నిలిచింది. తేజాన్ని ఇంటిలోని వారంతా కలిసి అమ్మాయిలా ముస్తాబు చేశారు. ఈక్రమంలోనే హీరోయిన్ శుభశ్రీ.. తేజకి లిప్‌స్టిక్ వేస్తున్న సమయంలో పెదాలతోనే నేరుగా వేయొచ్చుగా అని సరదాగా అడిగాడు. ఇది విన్న శుభశ్రీ.. ఇలాంటి పప్పులు ఉడకవంటూ తేజ చెంప పై లిప్‌స్టిక్ పూసింది.
అయినాసరి తేజ శుభశ్రీని అడుగుతుంటే, అది విన్న హీరోయిన్ షకీలా.. ముద్దే కదా అంటూ తేజ బుగ్గపై ఆమె ముద్దు పెట్టింది. ఇలా ఒక హీరోయిన్ నుంచి ముద్దు అడిగితే మరో హీరోయిన్ నుంచి ముద్దు వచ్చింది. అయితే ముద్దు పెట్టిన తరువాత షకీలా.. తేజ తనకి దేవుడిచ్చిన కొడుకు అంటూ చెప్పుకొచ్చింది.
