Bigg Boss 7 Day 65 : బిగ్‌బాస్ ఫ్యామిలీ వీక్.. హౌస్ లోకి ఎవరెవరు వచ్చారంటే? ఎమోషనల్ అయిన కంటెస్టెంట్స్..

ప్రతి సారి హౌస్ లో ఒక వారం ఫ్యామిలీ వీక్ ఉంటుందని తెలిసిందే. కంటెస్టెంట్స్ కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకరు హౌస్ లోకి వచ్చి వెళ్తారు.

Bigg Boss 7 Day 65 Highlights Family Week in House

Bigg Boss 7 Day 65 : బిగ్‌బాస్ పదోవారం సాగుతుంది. ప్రతి సారి హౌస్ లో ఒక వారం ఫ్యామిలీ వీక్ ఉంటుందని తెలిసిందే. కంటెస్టెంట్స్ కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకరు హౌస్ లోకి వచ్చి వెళ్తారు. దీంతో ఆ కంటెస్టెంట్స్ ఎమోషనల్ అయి ఆనందిస్తారు. ఈ వారం బిగ్‌బాస్ లో ఇదే ఫ్యామిలీ వీక్ జరుగుతుంది.

నిన్న మొదట శివాజీ కొడుకు హౌస్ లోకి వచ్చి సందడి చేశారు. శివాజిని చెక్ చేయడానికి డాక్టర్ లా వచ్చి ఆశ్చర్యపరిచాడు. దీంతో శివాజీ చాలా రోజుల తర్వాత కొడుకుని చూసిన ఆనందంతో హత్తుకొని ఏడ్చేశాడు. తన కొడుకుని హౌస్ లోకి తీసుకొస్తూ నా కొడుకు అంటూ అందరికి పరిచయం చేశాడు శివాజీ. శివాజీ కొడుకు వెళ్ళేటప్పుడు ఆట గురించి సలహాలు చెప్పాడు.

అనంతరం అర్జున్ వైఫ్ సురేఖ వచ్చింది. తాను ప్రగ్నెంట్ గా ఉండటంతో కంటెస్టెంట్స్ అందరూ కలిసి ఆమెకు శ్రీమంతం చేశారు. సురేఖ అర్జున్ కి ప్రేమగా తినిపించింది. ముద్దులు పెట్టింది. దీంతో అర్జున్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. సురేఖ కూడా వెళ్లేముందు అర్జున్ కి ఇంకా బాగా ఆడాలని, సైలెంట్ గా ఉంటున్నావని, మాట్లాడమని సలహాలిచ్చింది.

Also Read : Keedaa Cola : మల్టీప్లెక్స్‌లో రూ.112లకే కీడా కోలా సినిమా.. ఎక్కడెక్కడో తెలుసా..?

అనంతరం అశ్విని వాళ్ళ అమ్మ వచ్చింది. అమ్మని చూడగానే అశ్విని భోరున ఏడ్చేసింది. మెంటల్ గా తాను చాలా వీక్ ఉన్నట్టు నేను వచ్చేస్తాను, తీసుకెళ్ళిపో అని అమ్మని హత్తుకొని ఏడ్చేసింది అశ్విని. టైం అయ్యాక అశ్విని వాళ్ళ అమ్మ వెళ్తుంటే వెళ్లనివ్వకుండా హత్తుకొని, ఇక్కడే ఉండమని ఆపింది. ఇక నేటి ఎపిసోడ్ లో మరికొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ హౌస్ లోకి రానున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు