Bigg Boss 7 Day 9 : ఈ వారం నామినేషన్స్ లో ఉన్నది ఎవరంటే.. బిగ్‌బాస్ హోటల్.. కంటెస్టెంట్స్ కి రూమ్స్ డివైడ్..

మొదటి వారం అయ్యాక సోమవారం నాడు నామినేషన్స్ ప్రక్రియ కొనసాగిన సంగతి తెలిసిందే. కానీ అది మధ్యలోనే ఆపేసి ఎపిసోడ్ ని క్లోజ్ చేశారు. మిగిలిన నామినేషన్ ప్రక్రియ మంగళవారం నాడు పూర్తి చేశారు.

Bigg Boss 7 Day 9 Second Week Nominations full list

Bigg Boss 7 Day 9 : మొదటి వారం అయ్యాక సోమవారం నాడు నామినేషన్స్ ప్రక్రియ కొనసాగిన సంగతి తెలిసిందే. కానీ అది మధ్యలోనే ఆపేసి ఎపిసోడ్ ని క్లోజ్ చేశారు. మిగిలిన నామినేషన్ ప్రక్రియ మంగళవారం నాడు పూర్తి చేశారు. నిన్న ప్రశాంత్ ని తేజ, గౌతమ్, దామిని, అమర్ దీప్, ప్రియాంక, షకీలా నామినేట్ చేయగా వాళ్ళతో గొడవకి దిగి ఓవర్ యాక్షన్ చేస్తూ ఓవర్ గా మాట్లాడటంతో శోభా శెట్టి, రతిక, శుభశ్రీ కూడా వచ్చి నామినేట్ చేశారు. దీంతో ప్రశాంత్ షాక్ అయ్యాడు. అందరికి వార్నింగ్ ఇస్తూ.. ఆట ఇప్పుడే మొదలైందని, బయట మా వాళ్ళు మీ సంగతి చూసుకుంటారు అనడంతో కంటెస్టెంట్స్ అంతా కలిసి ప్రశాంత్ పై ఫైర్ అయ్యారు.
అనంతరం గౌతమ్ బాక్స్ లోకి రాగా ప్రశాంత్ అతనిని నామినేట్ చేశాడు.
శోభాశెట్టి రాగా.. శివాజీ ఆమెని నామినేట్ చేశాడు.
శుభశ్రీ, ప్రియాంకలను ఎవ్వరూ నామినేట్ చేయలేదు.
రతిక ని గౌతమ్, తేజ నామినేట్ చేశారు.
అమర్ దీప్ ని ప్రిన్స్ నామినేట్ చేశాడు.

దీంతో ఈ వారం నామినేషన్స్ లో శివాజీ, ప్రశాంత్, రతిక, తేజ, అమర్ దీప్, షకీలా, గౌతమ్, శోభా శెట్టి, ప్రిన్స్.. ఉన్నారు. మరి వీరిలో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.

గత వారం సందీప్ పవర్ అస్త్ర గెలుచుకోవడంతో అతనికి VIP రూమ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజా ఎపిసోడ్ లో మిగిలిన కంటెస్టెంట్స్ ఏ రూమ్ లో ఉండాలో సందీప్ నే నిర్ణయించమని బిగ్ బాస్ చెప్పాడు. దీంతో డీలక్స్ రూంలో షకీలా, శివాజీ, దామిని, శుభశ్రీ, అమర్ దీప్ ఉండొచ్చు అని చెప్పాడు. స్టాండర్డ్ రూమ్ లో రతిక, ప్రిన్స్, ప్రశాంత్, గౌతమ్, శోభా శెట్టి, ప్రియాంకలకు కేటాయించాడు. ఇక మిగిలిన తేజని బయట సోఫాలో పడుకోమన్నాడు. దీంతో రూమ్స్ దగ్గర కూడా గొడవ పడ్డారు కంటెస్టెంట్స్.

Bigg Boss 7 Day 8 : ఈ వారం నామినేషన్స్ లో ఎవరెవరు ఉన్నారు? ప్రశాంత్ కి కౌంటర్ల మీద కౌంటర్లు..

పవర్ అస్త్ర గెలుచుకొని సందీప్ అయిదు వారాలు హౌస్ లో ఫిక్స్ అయినట్టు నిన్నటి ఎపిసోడ్ లో మాయా అస్త్ర అని ఇంకోటి పెట్టి ఇది ఎవరు గెలుస్తారో అని టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. కంటెస్టెంట్స్ ని రెండు టీమ్స్ గా విడకొట్టి ఈ టాస్క్ ఆడించారు.

ట్రెండింగ్ వార్తలు