Bigg Boss 7 : ఐదో వారంలో నామినేషన్స్‌లో ఉన్నదెవరో..? రాజుగారి పెద్ద భార్య మంచిదంటే..?
బిగ్‌బాస్ (Bigg Boss) తెలుగు సీజన్ 7లో నాలుగు వారాలు ముగిశాయి. నలుగురు కంటెస్టెంట్లు కిరణ్ రాథోడ్, షకీలా, సింగర్ దామిని, రతిక లు ఎలిమినేట్ అయ్యారు.
- Thota Vamshi Kumar
- Published On : October 2, 2023 / 06:36 PM IST
Bigg Boss 7 Fifth week nominations
Bigg Boss 7 Fifth week nominations : బిగ్‌బాస్ (Bigg Boss) తెలుగు సీజన్ 7లో నాలుగు వారాలు ముగిశాయి. నలుగురు కంటెస్టెంట్లు కిరణ్ రాథోడ్, షకీలా, సింగర్ దామిని, రతిక లు ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం బిగ్‌బాస్ హౌస్‌లో 10 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. ఇక ఐదో వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియను బిగ్‌బాస్ మొదలెట్టాడు. ఇందుకు సంబంధించిన ప్రొమోను విడుదల చేశారు. ఇంట్లో ఉండేందుకు అనర్హులు అయిన ఇద్దరు వ్యక్తుల పేర్లను చెప్పి అందుకు గల కారణాలు చెప్పాలని, ఆ తరువాత వారి ఒంటిపై ఉన్న ప్యాడ్‌కు కత్తిని గుచ్చాలని సూచించాడు.
ఒక అన్న తన తమ్ముడితో కలిసి బ్యాంకు దోపిడికి వెళ్లాడు. అయితే.. అతడు అందరినీ చంపుకొంటూ ఒక్కడే బయటకు వచ్చాడు. ఈ ఆటలోనూ అలా ఒక్కడే బయటకు వస్తాడు అంటూ శివాజీని నామినేట్ చేస్తూ అమర్ దీప్ అన్నాడు. దీనిపై శివాజీ మాట్లాడుతూ.. రాజుగారి పెద్ద భార్య మంచిది అంటే చిన్న భార్య మంచికాదని కాదుగా అంటూ కౌంటర్ ఇచ్చాడు. అటు ప్రియాంకను శోభాశెట్టి నామినేట్ చేసింది. గ్రూపులు ఉండి నామినేషన్స్ చేస్తున్నారనే కారణాన్ని ఆమె చెప్పింది.
Rathika : నాలుగు వారాలకు రతిక ఎంత సంపాదించిందో తెలుసా..?
దీనిపై ప్రియాంక అసహనం వ్యక్తం చేసింది. ఇక్కడ మీకు ఏ సమయంలో గ్రూపిజం కనిపించిందో చెప్పాలని శోభాను ప్రశ్నించింది. ఇలా హౌస్ మేట్స్ అందరూ ఒక్కొక్కరుగా కారణాలను చెబుతూ నామినేషన్ చేసుకున్నారు. చూస్తుంటే ఈ వారం నామినేషన్ ప్రక్రియ కాస్త వాడీవేడీగానే సాగినట్లు అర్థం అవుతోంది. మరీ ఈ వారం నామినేషన్‌లో ఎవరెవరు ఉన్నారో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.
