Bigg Boss 7 Winner Pallavi Prashanth Absocoded from his Village Rumours goes Viral
Pallavi Prashanth : బిగ్‌బాస్(Bigg Boss) సీజన్ 7లో విన్నర్ గా పల్లవి ప్రశాంత్ ని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ప్రశాంత్ ని విన్నర్ గా ప్రకటించిన దగ్గర్నుంచి వైరల్ అవుతూనే ఉన్నాడు. హౌస్ లో, బిగ్‌బాస్ కి వెళ్ళకముందు అమాయకంగా, వినయంగా ఉండి సింపతితో కప్పు కొట్టేశాక బిగ్‌బాస్ నుంచి బయటకి వచ్చాక తన యాటిట్యూడ్ చూపిస్తూ వైరల్ అయ్యాడు.
ఆదివారం నాడు బిగ్‌బాస్ ఫైనల్ జరగగా హౌస్ నుంచి కంటెస్టెంట్స్ బయటకి వస్తుంటే పలువురు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అమర్ దీప్, అశ్విని, గీతూ, హర్ష, భోలే.. కార్లు పగలకొట్టి వారిని భయపెట్టి, అసభ్య పదజాలంతో దూషించారు. ఇక పల్లవి ప్రశాంత్ ని పోలీసులు ఆగకుండా వెళ్లిపోండి లా & ఆర్డర్ ప్రాబ్లమ్ వస్తుంది అని చెప్పినా ప్రశాంత్ వినకుండా పోలీస్ వారితో గొడవ పెట్టుకొని ఊరేగింపుగా వెళ్ళాడు. దీంతో పల్లవి ప్రశాంత్ అభిమానులు రెచ్చిపోయి నానా హంగామా చేశారు.
ఈ మొత్తం ఘటనలో కొన్ని పోలీస్ వాహనాలు, ప్రైవేట్ వాహనాలు, గవర్నమెంట్ బస్ అద్దాలు ధ్వంసం అయ్యాయి. దీంతో పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి ప్రశాంత్ ని A1 గా, అతని తమ్ముడిని A2 గా చేర్చి మీడియా వీడియోలు, సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా దాడులకు పాల్పడ్డ వారిని గుర్తిస్తున్నారు పోలీసులు. నిన్న రాత్రి ఈ ఘటనలో ఇద్దరిని అరెస్ట్ చేశారు.
పల్లవి ప్రశాంత్ మీద కేసు పెట్టారు, ఇద్దరు అరెస్ట్ అయ్యారు అని తెలిసిన తర్వాత నిన్న రాత్రి ప్రశాంత్ తన సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ వీడియో షేర్ చేసాడు. ఆ తర్వాత నుంచి ప్రశాంత్ కనపడట్లేదని, ప్రశాంత్ పారిపోయాడు అని, ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ వస్తుందని వార్తలు వస్తున్నాయి. పోలీసులు అతని కోసం గాలిస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే పలు పేపర్లు, మీడియా సంస్థలు ప్రశాంత్ పరారీలో ఉన్నాడని తెలిపాయి. సోషల్ మీడియాలో కూడా పల్లవి ప్రశాంత్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఎటో వెళ్లిపోయాడని పోస్టులు వస్తున్నాయి.
అయితే కొన్ని నిమిషాల క్రితమే పల్లవి ప్రశాంత్ దీనిపై స్పందిస్తూ ప్రశాంత్ తన సోషల్ మీడియాలో లైవ్ లోకి వచ్చాడు. ఈ లైవ్ లో నేను ఎక్కడికి వెళ్లిపోలేదు, ఊళ్ళోనే ఉన్నాను, కావాలంటే మా ఊరి వాళ్ళని అడగండి, నా మీద నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు అని తెలిపాడు. మరి పోలీసులు ఈ కేసులో పల్లవి ప్రశాంత్ ని అరెస్ట్ చేస్తారా? అదుపులోకి తీసుకుంటారా? విచారిస్తారా? చూడాలి.