×
Ad

Bigg Boss 9 Telugu Winner: బిగ్‌బాస్ సీజన్ 9 విన్నర్ కల్యాణ్ పడాల ఎంత ప్రైజ్ మనీ గెలుచుకున్నాడో తెలుసా..

బిగ్‌బాస్‌ ఇచ్చిన 20 లక్షల రూపాయల గోల్డెన్ బ్రీఫ్‌ కేసును కూడా వద్దనుకుని చివరి వరకూ విజయంపై నమ్మకంతో నిలబడ్డాడు కల్యాణ్. ఆ నమ్మకమే కల్యాణ్‌ను విజేతని చేసింది.

Bigg Boss 9 Telugu Winner: ఉత్కంఠకు తెరపడింది. ప్రముఖ తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ ఎవరో డిక్లేర్ అయిపోయింది. ఒక కామనర్ చరిత్ర సృష్టించాడు. బిగ్ బాస్ విన్నర్ గా నిలిచాడు. సీజన్ 9 విజేతగా కల్యాణ్ పడాలను ప్రకటించారు హోస్ట్ నాగార్జున. కచ్చితంగా గెలుస్తుందనుకున్న నటి తనూజాకు నిరాశే మిగిలింది. తనూజ రన్నరప్ తో సరి పెట్టుకుంది. చివరివరకు ఉత్కంఠగా సాగిన ఈ సీజన్‌లో.. కల్యాణ్, తనూజ మధ్య గట్టి పోటీనే నడిచింది. చివరికి ప్రేక్షకుల నుంచి అత్యధిక ఓట్లు సాధించిన కల్యాణ్‌ విజేతయ్యాడు.

ఐదుగురితో మొదలైన గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌లో మొదట సంజన, ఇమ్మాన్యుయేల్ ఎలిమినేట్ అవ్వగా.. రూ.15 లక్షల సూట్ కేస్ ఆఫర్‌తో డెమోన్ పవన్ ఎలిమినేట్ అయ్యాడు. బిగ్‌బాస్‌ ఇచ్చిన 20 లక్షల రూపాయల గోల్డెన్ బ్రీఫ్‌ కేసును కూడా వద్దనుకుని చివరి వరకూ విజయంపై నమ్మకంతో నిలబడ్డాడు కల్యాణ్. ఆ నమ్మకమే కల్యాణ్‌ను విజేతని చేసింది.

టైటిల్ విన్నర్ కల్యాణ్ ఎంత ప్రైజ్ మనీ గెలుచుకున్నాడు అనేది ఆసక్తిగా మారింది. టైటిల్ విన్నర్ కల్యాణ్ 35 లక్షల రూపాయల ప్రైజ్‌ మనీ గెలుచుకున్నాడు. దాంతో పాటుగా షో స్పాన్సర్స్‌లో ఒకరైన ‘రాఫ్‌ గ్రిప్పింగ్‌’ 5 లక్షల రూపాయల క్యాష్‌ ప్రైజ్‌ అందజేసింది. అలాగే మారుతీ సుజుకీ విక్టోరిస్‌ కారును కూడా కల్యాణ్‌ సొంతం చేసుకున్నాడు.

ఈ సీజన్ లో సామాన్యులందరికీ ఒకటే రెమ్యునరేషన్‌ ఫిక్స్‌ చేసింది బిగ్‌బాస్‌ టీమ్‌. అలా అందరిలాగే కల్యాణ్‌కు సైతం ప్రతి వారానికి రూ.70వేలు అందాయి. 15 వారాలకు 10.50 లక్షల రూపాయలు సంపాదించాడు. ట్రోఫీతోపాటు రూ.50 లక్షలు కూడా కైవసం చేసుకునే వాడే. కానీ, డెమాన్ పవన్‌ 15 లక్షల రూపాయల సూట్‌కేస్‌ తీసుకోవడంతో మిగిలిన 35 లక్షలు కల్యాణ్ పడాల సొంతం చేసుకున్నాడు.

ఈసారి బిగ్‌బాస్‌కు ముందు నిర్వాహకులు పెట్టిన అగ్ని పరీక్షలో ఒక కామన్‌ మ్యాన్‌గా కల్యాణ్‌ పడాల పోటీ పడ్డాడు. అక్కడ కూడా ప్రేక్షకుల మనసులు గెలుచుకుని హౌస్‌లోకి అడుగు పెట్టాడు. చివరికి టైటిల్ విన్నర్ గా నిలిచాడు.

సీఆర్పీఎఫ్ జవాన్ అయిన కల్యాణ్‌కు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఆసక్తి. ఇంట్లో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉద్యోగంలో చేరాల్సి వచ్చింది. ‘బిగ్‌బాస్‌ సీజన్‌9’ సందర్భంగా నిర్వహిస్తున్న అగ్నిపరీక్ష గురించి తెలుసుకుని అప్లయ్ చేసుకున్నాడు. అలా సామాన్యుల నుంచి హౌస్‌లోకి అడుగు పెట్టిన తొలి కంటెస్టెంట్‌ కూడా కల్యాణే కావడం గమనార్హం.

తనను ప్రేమించిన వారికి, తనను నమ్మి ఓటు వేసిన వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు కల్యాణ్ చెప్పాడు. ఈ సీజన్‌లో ప్రియ, శ్రీజ, తనూజలు తనను ఎంతో సపోర్ట్‌ చేశారని, వారికి స్పెషల్‌ థ్యాంక్స్‌ చెప్పాడు. ఒకానొక సమయంలో తనకు ధైర్యమిచ్చి ముందుకు పంపిన వ్యక్తి తనూజ అని చెప్పాడు. ప్రేక్షకులు ఇచ్చిన మద్దతుతో తన ప్రయాణం ఇక్కడి వరకూ సాగిందన్నాడు విజేత కల్యాణ్ పడాలి.