Bigg Boss 10 Telugu Captaincy : కెప్టెన్సీ కోసం పోరాటం.. గ్రూపులు లేకుండా ఆడి.. చివర్లో మన గ్రూప్ అంటూ బయటపెట్టిన అమన్.. బిగ్ బాస్ 10 ‘డే 9’ ఫుల్ ఎపిసోడ్..
Bigg Boss 10 Telugu Today Episode : బిగ్ బాస్ రెండో అవతారం పవర్ ఆఫ్ పీపుల్ అని అందర్నీ పిలిచాడు. (Bigg Boss Captaincy)
Bigg Boss Telugu 10 Day 9 Full Episode Captaincy Fight
Bigg Boss 10 Telugu Today : నిన్న నామినేషన్స్ తర్వాత ఎవరికి వాళ్ళు డిస్కషన్స్ పెట్టారు. సుధీర్ కట్టప్ప గా మారి మోసం చేసినందుకు త్రిగున్ అందరితో సుధీర్ చేసిన పనులు చెప్పి అతనితో మాట్లాడటం, చూడటం కూడా ఇష్టం లేదు అని చెప్పుకొచ్చాడు. సుధీర్ సృష్టి కోసమే త్రిగున్ ని నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. అందుకే సుధీర్ – త్రిగున్ లను సృష్టి కలిపింది. ఇద్దరూ నామినేషన్స్ గురించి డిస్కషన్ చేసారు. రోహిత్ తన టీమ్ దగ్గర మాట్లాడుతూ.. త్రిగున్ అందర్నీ మంచి చేసుకోవాలనుకుంటున్నాడు. అది తప్పు, అది కరెక్ట్ కాదు అని ఎప్పటిలాగే త్రిగున్ గురించి తన టీమ్ దగ్గర నెగిటివ్ చేసి మాట్లాడాడు. సెలబ్రిటీల టీమ్ లో గొడవలు అవడానికి ఎదురు చూస్తున్నట్టు చెప్పాడు రోహిత్.
రోహిత్ అమన్ ని సరిగ్గా పని చేయట్లేదని తిట్టాడు. దీంతో ఇద్దరూ తిట్టుకున్నారు. దేబ్జానీ – ముకేశ్ కాసేపు సరదాగా గొడవ పడి వల్ల లవ్ ట్రాక్ నడిపారు. ముకేశ్ షర్ట్ లేకుండా వచ్చి దేబ్జానీతో ఆడుకున్నాడు. బిగ్ బాస్ పూలు, మోదక్ లు పంపించడంతో టీమ్ అంతా వినాయక చవితి సెలబ్రేషన్స్ నిర్వహించారు. వర్షిణి – ముకేశ్ – సుధీర్ మాట్లాడుకుంటుంటే సృష్టి పిలవగానే సుధీర్ వెళ్ళిపోయాడు. దీంతో సృష్టి కోసం సుధీర్ వెళ్ళిపోతుంది మళ్ళీ వాళ్ళ గురించి డిస్కషన్ జరిగింది.
Also See – Thanuja Puttaswamy : సీరియల్ నటి తనూజ వినాయక చవితి సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్..
బిగ్ బాస్ రెండో అవతారం పవర్ ఆఫ్ పీపుల్ అని అందర్నీ పిలిచాడు. జనాలు హౌస్ లో జరిగే నిర్ణయాలు తీసుకుంటారు. కెప్టెన్సీ కంటెండర్లు ఎవరు పోటీ చేయాలి అని జనాలు వాళ్లకు ఓట్లు వేశారు. కానీ కెప్టెన్ అవ్వాలంటే మీరే టాస్కులు చేయాలి అని చెప్పి త్రిగున్, దేబ్జానీ, అమన్, షాలిని, ముకేశ్, రోహిత్, ఝాన్సీ, రామ్ ప్రసాద్ లను కెప్టెన్సీ కోసం పోటీ పడే కంటెండర్స్ గా నిలిపారు. దీంతో వీళ్ళకు కొన్ని టాస్క్ లు ఉంటాయని చెప్పారు. రెండు లెవల్స్ ఉంటాయి. మొదటి లెవల్ లో గెలిచినా వాళ్లకు కష్టమైన టాస్క్ లు. మొదటి లెవల్ లో ఒదిన వాళ్లకు వేరే టాస్క్ లు ఉంటాయని చెప్పాడు.
మొదటి టాస్క్ లో అందరి తలపై నాలుగు బెలూన్స్ పెట్టారు. వర్షిణి ఈ గేమ్ కి సంచాలక్ గా వ్యవహరించింది. ఒక పదం చూపిస్తారు. దాని స్పెల్లింగ్ కరెక్ట్ రాయాలి. కరెక్ట్ రాసిన వాళ్ళు మిగిలిన పోటీ దారులలో ఒకరి బెలూన్ ని పగలకొట్టి కెప్టెన్సీ ఎందుకు వాళ్ళు అవ్వకూడదు రీజన్ చెప్పాలి అని అన్నారు. ముందు ఎవరి నలుగురివి పగిలిపోతాయో వాళ్ళు ఓడిపోయినట్టు మిగిలిన వాళ్ళు మొదటి లెవల్ ఆడతారు అని చెప్పాడు బిగ్ బాస్.
ఈ టాస్క్ లో మొదటి రౌండ్ లో ఝాన్సీ.. రోహిత్ గ్రూప్ చేసుకొని ఆడుతున్నాడు అని అతని బెలూన్ పగలకొట్టింది. ముకేశ్.. త్రిగున్ డామినేట్ చేస్తున్నాడు అని, దేబ్జానీ.. త్రిగున్ ట్రిగ్గర్ అవుతాడు అని, అమన్.. షాలిని యాంగర్ మేనేజ్మెంట్ అని, షాలిని.. త్రిగున్ ని నువ్వు నాకు కాంపిటీటర్ నువ్వు ఉండొద్దు నేను గెలవాలంటే అని చెప్పి బెలూన్ పగలకొట్టింది.
Also See – Disha patani : బాలీవుడ్ ముద్దు గుమ్మ దిశా పటాని లేటెస్టు ఫోటోలు..
సెకండ్ రౌండ్ లో రామ్ ప్రసాద్.. రోహిత్ ని, రోహిత్.. రామ్ ప్రసాద్ బెలూన్ పగలకొట్టాడు. పాత నామినేషన్ పాయింట్స్ పట్టుకొని ఎమోషన్స్ పాయింట్ పట్టుకొని పగలకొట్టాడు. అయితే నేను నాకు పోటీ ఇచ్చేవాళ్ళని తప్పించను అన్నాడు. దేబ్జానీ.. షాలినిని, త్రిగున్.. ముకేశ్ ని, ఝాన్సీ.. దేబ్జానీని నాకు ఫస్ట్ లేడీ కెప్టెన్ అవ్వాలని ఉంది అని చెప్పి ఆమె బెలూన్ పగలకొట్టింది. షాలిని.. రామ్ ప్రసాద్ బెలూన్ దేబ్జానికి సపోర్ట్ చేస్తున్నందుకు పగలకొట్టింది. అమన్.. దేబ్జానీ లాంగ్వేజ్ వల్ల పగలకొట్టాడు. ముకేశ్.. త్రిగున్ బెలూన్ పగలకొట్టాడు. దీంతో త్రిగున్ నాలుగు బెలూన్స్ పగిలిపోవడంతో మొదట త్రిగున్ టాస్క్ నుంచి తప్పుకున్నాడు.
రామ్ ప్రసాద్.. షాలిని బెలూన్ పగలకొట్టాడు టైమింగ్ సెన్స్ లేదని. ముకేశ్.. రోహిత్ కి ఓపిక లేదు అని చెప్పి బెలూన్ పగలకొట్టాడు. రోహిత్.. రామ్ ప్రసాద్ నాకంటే స్ట్రాంగ్, నాకు పోటీ ఉండొద్దు అని బెలూన్ పగలకొట్టాడు. అయితే అంతకు ముందే నాకంటే స్ట్రాంగ్ వాళ్ళను తప్పించను, నాకు పోటీ కావాలి అని చెప్పి ఇప్పుడు నాకంటే స్ట్రాంగ్ అని బెలూన్ పగలకొట్టడం గమనార్హం. మరోసారి రోహిత్ ఎలాంటి గేమ్ ఆడుతున్నాడో తెలుస్తుంది దీంతో.
ఝాన్సీ.. రోహిత్ నన్ను భజన బ్యాచ్ అన్నాడని బెలూన్ పగలకొట్టింది. దీంతో ఝాన్సీ – రోహిత్ మధ్య గొడవ అయింది. మధ్యలో త్రిగున్ రావడంతో రోహిత్ తో గొడవ అయింది. షాలిని.. రామ్ ప్రసాద్ బెలూన్ ని, ముకేశ్.. అమన్ బెలూన్స్ ని పగలకొట్టాడు. దాంతో రోహిత్ కూడా వెళ్ళిపోయాడు.
లాస్ట్ రౌండ్ లో అమన్.. ముకేశ్ బెలూన్ ని, ముకేశ్.. అమన్ బెలూన్ ని, షాలిని.. దేబ్జానీ బెలూన్ ని, దేబ్జానీ.. అమన్ బెలూన్ ని, ఝాన్సీ.. దేబ్జానీ బెలూన్ ని పగలకొట్టింది. ఫైనల్ గా అమన్, ఝాన్సీ, ముకేశ్, షాలిని మిగిలారు. వీళ్ళు మొదటి లెవల్ కెప్టెన్సీ కోసం పోటీ పడనున్నారు. ఈ టాస్క్ అంతా అయ్యాక ఎవరికి వాళ్ళు దీని గురించి డిస్కషన్ చేసుకుంటున్నారు.
Also See : Gnaneswari Kandregula : పార్ట్ టైమర్స్ సిరీస్ ఫేమ్ జ్ఞానేశ్వరి కాండ్రేగుల.. వినాయక చవితి ఫోటోలు..
చివర్లో అమన్ షాలిని దగ్గరికి వచ్చి మొదట నీ బెలూన్ కొట్టాను. లేకపోతే మనం గ్రూప్ గా ఆడుతున్నాం అంటారు. ముందు నీ బెలూన్ పగలకొట్టా కాబట్టి మన గ్రూప్ గురించి రాదు. కానీ నువ్వు హర్ట్ అయ్యావు సారీ. తర్వాత నన్ను టార్గెట్ చేసుకో నువ్వు అని అమన్ అందరూ అనుకున్నట్టే వాళ్ళ అగ్నిపరీక్ష బ్యాచ్ గ్రూపిజంని బయట పెట్టాడు. మరి కెప్టెన్ ఎవరు అవుతారో రేపు చూడాలి.
