Sarayu : సైలెంట్ గా పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ బోల్డ్ బ్యూటీ సరయు.. పోస్ట్ వైరల్..

సడెన్ గా సరయు తనకు పెళ్లి అయినట్టు పోస్ట్ చేసింది. (Sarayu)

  • Published on- October 18, 2026 / 07:33 AM IST

Sarayu

Sarayu : యూట్యూబ్ లో బోల్డ్, అడల్ట్ కంటెంట్ తో సిరీస్ లు, షార్ట్ ఫిలిమ్స్ చేసి వైరల్ అయింది సరయు. 7 ఆర్ట్స్ అనే ఓ యూట్యూబ్ ఛానల్ కంటెంట్ తో ఫేమ్ తెచ్చుకుంది సరయు. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 5, ఓటీటీ సీజన్ లో పాల్గొని మరింత పాపులారిటీ తెచ్చుకుంది. ఈ మధ్య అడపాదడపా సినిమాల్లో నటిస్తుంది.

సడెన్ గా సరయు తనకు పెళ్లి అయినట్టు పోస్ట్ చేసింది. పెళ్లి దుస్తుల్లో ఉన్న సరయు తన తల్లి ముద్దు పెడుతున్న ఫోటో షేర్ చేసి.. ఎప్పటికీ అమ్మ కూతురినే. ఇప్పుడు, ఒక కొత్త అధ్యాయం మొదలవుతోంది. ఇది సాక్షాత్తూ పరమశివుడే నా కోసం రాసిందని నేను నమ్ముతున్నాను. కొన్ని దీవెనలు మాటల్లో చెప్పలేనంత పవిత్రమైనవి. కొన్ని ఆరంభాలకు ప్రత్యేక ప్రకటనలు అవసరం లేదు. కేవలం అచంచలమైన విశ్వాసం, అమ్మ ప్రేమ, మరియు మహాదేవుని ప్రశాంతమైన అనుగ్రహం మాత్రమే కావాలి. హర్ హర్ మహాదేవ్ అంటూ పోస్ట్ చేసింది.

Also Read : Bigg Boss Weekend Episode : షాలిని దుమ్ము దులిపేసిన నాగార్జున.. అయినా మారేలా లేదు.. ఏడ్చిన నీతూ మాస్టర్.. బిగ్‌ బాస్ 10 డే 41 వీకెండ్ ఎపిసోడ్‌..

అలాగే తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో తన భర్త చెయ్యిని పట్టుకున్న ఫోటో షేర్ చేసింది. కానీ సరయు తన భర్త ఫేస్ ని రివీల్ చేయలేదు. ఎవర్ని పెళ్లి చేసుకుందో కూడా చెప్పలేదు. పలువురు సెలబ్రిటీలు, ఫాలోవర్స్ ఆమెకు కామెంట్స్ లో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరి సరయు ఎవర్ని పెళ్లి చేసుకుందో తెలియాల్సి ఉంది.