Bigg Boss Nominations : నామినేషన్స్ ఫైర్.. ఈ వారం ఎవరెవరు నామినేషన్స్‌లో ఉన్నారంటే.? త్రిగున్ ఏడుస్తుంటే నవ్వుకున్న రోహిత్..
మరో నామినేషన్ ప్రక్రియ మొదలయింది. (Bigg Boss Nominations)
- Saketh U
- Published on- October 27, 2026 / 10:56 PM IST
Bigg Boss Nominations
Bigg Boss Nominations : నిన్న గ్రీన్ లో ఉన్న గోట్స్ నామినేషన్స్ చేసారు. నామినేషన్స్ అయిన తర్వాత త్రిగున్ – వర్షిణి ని నామినేట్ చేయడంతో ఇద్దరూ బాధపడ్డారు. దీని గురించి ఒకరికొకరు డిస్కస్ చేసుకున్నారు. ఈ చర్చలోకి ముకేశ్, దేబ్జానీ వచ్చారు. వర్షిణి అర్ధం చేసుకోకపోవడం, తనకు సపోర్ట్ చేయలేదు అనడం, తన ఫ్రెండ్ అయిన వర్షిణిని నామినేట్ చేసినందుకు త్రిగున్ ఎమోషనల్ అయ్యాడు. శ్వేతా, వంశీతో మాట్లాడుతూ ఏడ్చాడు త్రిగున్. తర్వాత వర్షిణి – త్రిగున్ మాట్లాడుకున్నారు. వర్షిణి.. ఇదేనా నువ్వు , నాకు తెలిసిన త్రిగున్ నువ్వు కాదు అని అడిగింది. అర్ధం చేసుకోవా వర్షిణి అంటూ ఇద్దరి మధ్య డిస్కస్ జరిగింది. ఇక త్రిగున్ ఏడుస్తుంటే రోహిత్ ఫుల్ గా నవ్వుకున్నాడు కామెడీ చేస్తూ. త్రిగున్ నామినేషన్స్ గురించి వర్షిణి మాట్లాడదామని ముకేశ్ దగ్గరకు వెళ్తే నేను చికెన్ తినాలి. నాతో డిస్కషన్ పెట్టొద్దు అని చెప్పి వెళ్ళిపోయాడు.
అనంతరం గోట్ లో జరిగిన వెయిట్స్ గేమ్ గురించి, అందులో ఎవరెవరు ఎలా ఆడారు అని నరేష్, రామ్ ప్రసాద్ కామెడీ స్కిట్ చేసి, అందర్నీ ఇమిటేట్ చేసి ఫుల్ గా నవ్వించారు.
అనంతరం మరో నామినేషన్ ప్రక్రియ మొదలయింది. గ్రీన్ లో ఉన్న గోట్స్ జడ్జీలుగా ఉంటారు. మొదట ఎల్లో లెవల్ లో ఉన్నవాళ్లలో ముగ్గురికే నామినేషన్ వేసే అవకాశం ఉంటుంది. ఎవరు నామినేషన్ వేయాలి అని గ్రీన్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఎల్లో వాళ్ళు ఇద్దర్ని నామినేట్ చేయాలి. వాళ్ళు చెప్పిన కారణాలు విని ఒకటి ఫైనల్ చేయాలి గ్రీన్ జడ్జీలు.
Also Read : Nivetha Pethuraj : ఆదర్శ కుటుంబం ప్రీ రిలీజ్ ఈవెంట్.. చీరకట్టులో నివేతా పేతురేజ్.. ఫొటోలు..
మొదట నరేష్ వచ్చి – ఝాన్సీ, వర్షిణి లను నామినేట్ చేసాడు. వర్షిణి గేమ్స్ ఆడట్లేదు. తొందరగా గివ్ అప్ ఇచ్చేస్తుంది అని నామినేట్ చేసాడు. దీంతో వర్షిణి నాకు సర్జరీ అయింది అంటూ తన వివరణ ఇచ్చుకుంది. ఝాన్సీ ఎక్కువ ఏడుస్తున్నావు, బాగా ఆడాలని అనుకోవట్లేదు అని చెప్పి నామినేషన్ చేసాడు. దీంతో జడ్జీలు డిస్కస్ చేసుకోవడానికి వెళ్లారు. దాంతో గ్యాప్ రావడంతో వర్షిణి, రోహిత్, సుధీర్ త్రిగున్ గురించి డిస్కషన్ పెట్టి త్రిగున్ గ్రాఫ్ పడిపోయింది అని మాట్లాడుకున్నారు. ఫైనల్ గా నరేశ్ – వర్షిణి ని చేసిన నామినేషన్ ఫైనల్ చేసారు.
నెక్స్ట్ శివ వచ్చి – సుధీర్, వంశీ లను నామినేట్ చేసాడు. శివ – వంశీ గురించి మాట్లాడుతూ ముకేశ్ గతంలో చేసిన నామినేషన్స్ ఉదాహరణగా చెప్తుంటే ముకేశ్ వచ్చి పెద్ద గొడవ పెట్టుకున్నాడు. సుధీర్ నామినేషన్ ని ఫైనల్ చేసారు గోట్స్. నెక్స్ట్ రామ్ ప్రసాద్ ని పిలిచారు. రామ్ ప్రసాద్ శివ, శ్వేతా లని నామినేట్ చేసాడు. శివ నామినేషన్ ని ఫైనల్ చేసారు.
అనంతరం రెడ్ టీమ్ లో ఉన్నవాళ్లకు ఒకరినే నామినేట్ చేసే అవకాశం. అందులో ఎవరో ఒకర్ని ఫైనల్ చేయాలి గ్రీన్ టీమ్ జడ్జీలు. మొదట రోహిత్, రామకృష్ణ లను పిలిచారు. రోహిత్ – నరేష్ ని నామినేట్ చేసాడు. రామకృష్ణ – వర్షిణి ని నామినేట్ చేసాడు. రామకృష్ణ వర్షిణి ని చేసిన నామినేషన్ ని ఓకే చేసారు. అనంతరం ఝాన్సీ, శ్వేతలు వచ్చారు. ఝాన్సీ – శివ ని నామినేట్ చేసింది. శ్వేతా – ఝాన్సీ ని నామినేట్ చేసింది. శ్వేతా – ఝాన్సీ ని చేసిన నామినేషన్ ఫైనల్ చేసారు.
గ్రీన్ లో ఉన్న గోల్స్ కి రెండు వారాలు నామినేషన్స్ సేఫ్ అయ్యారు. ఈ రెండు రోజులు జరిగిన నామినేషన్స్ లో ఝాన్సీ, రోహిత్, రామకృష్ణ, సుధీర్, రామ్ ప్రసాద్, వర్షిణి, శివలు నామినేషన్స్ లో నిలిచారు. శ్వేతా, నరేశ్, వంశీ లు నామినేషన్స్ లో లేరు. దీంతో వీరిలో ఎవరో ఒకరిని గ్రీన్ లో ఉన్న గోట్స్ నామినేట్ చేయాలి అని బిగ్ బాస్ చెప్పడంతో వంశీ ని నామినేట్ చేసారు. మొత్తంగా ఈ వారం ఝాన్సీ, రోహిత్, రామకృష్ణ, సుధీర్, రామ్ ప్రసాద్, వర్షిణి, శివ, వంశీలు నామినేషన్స్ లో ఉన్నారు. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.
