Bigg Boss Nominations : నామినేషన్స్ హీట్.. ముకేష్ వర్సెస్ అపూర్వ.. మధ్యలో త్రిగుణ్.. రచ్చ రచ్చ..
సోమవారం నామినేషన్స్ హీట్ (Bigg Boss Nominations ) మొదలయ్యాయి. ముకేశ్, అపూర్వల మధ్య మాటల యుద్ధం నడిచింది
- Thota Vamshi Kumar
- Updated on- October 5, 2026 / 10:41 PM IST
Bigg Boss Season 10 Telugu Day 29 Nominations mukesh vs apoorva
Bigg Boss Nominations : బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో నాలుగు వారాలు పూర్తి అయ్యాయి. నలుగురు ఎలిమినేట్ అయ్యారు. ఇక ఐదో వారంలోకి అడుగుపెట్టింది. సోమవారం నామినేషన్స్ అన్న సంగతి తెలిసిందే. నామినేషన్స్ పలు రౌండ్స్ జరిగాయి. ఓ గుమ్మడికాయని దాచిపెట్టి ఇద్దరిద్దర్ని పిలుస్తారు. విజేతకు ఇద్దరు, ఓడిపోయిన వారికి ఒకరిని నామినేట్ చేసే అవకాశం ఇచ్చారు. ఇమ్యూనిటి గెలవడంతో సుదీర్, వంశీలను కెప్టెన్ కావడంతో వర్షిణిని నామినేట్ చేసేందుకు వీలులేదు.
తొలుత వర్షిణి గుమ్మడికాయని దాచిపెట్టగా.. రామ్ ప్రసాద్, ముకేశ్ వెతికారు. రామ్‌ప్రసాద్ విజేతగా నిలిచాడు. గత వారం డాగర్ టాస్క్‌లో త్రిగుణ్ మెడను పట్టుకోలేదని అన్నావు.. కానీ వీడియోలో చూస్తే పట్టుకున్నావు అని చెబుతూ మొదట అమన్‌ను రామ్‌ప్రసాద్ నామినేట్ చేశాడు. ఆ తరువాత.. నువ్వు నా హీరోవి, అయినప్పటికి రోహిత్ ను నువ్వు అలా అనడం నచ్చలేదు.. గేమ్‌లో కోపం చూపించుకో, కానీ బయట కాదు అని చెబుతూ త్రిగుణ్‌ను నామినేట్ చేశాడు రామ్‌ప్రసాద్. ఈ క్రమంలో త్రిగుణ్ మాట్లాడుతూ.. తాను డిఫెండ్ చేసుకోనని రోహిత్ కు సారీ చెప్పాడు. అయితే.. రోహిత్ మాత్రం తాను క్షమించనని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో త్రిగుణ్, రోహిత్ ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
Faria Abdullah : మిల మిలా నక్షత్రంలా మెరిసిపోతున్న ఫరియా అబ్దుల్లా.. ఫోటోలు వైరల్..
ఇక అపూర్వను ముకేష్ నామినేట్ చేశాడు. కెప్టెన్సీలో తన ప్రవర్తన నచ్చలేదని చెప్పాడు. ఈ క్రమంలో అపూర్వ, ముకేష్ మధ్య మాటల యుద్ధం నడించింది. ట్రయాంగిల్ లవ్ స్టోరీ, చిన్నదో వైపు పెద్దదో వైపు అలాంటి మాటలు మాట్లాడడం పద్దతి కాదని అపూర్వ చెప్పుకొచ్చింది.
ఇక వంశీ గుమ్మడి కాయ దాచిపెట్టగా.. అమన్, త్రిగుణ్‌లు గుమ్మడికాయ కోసం వెతికారు. ఇందులో త్రిగుణ్ విజేతగా నిలిచాడు. నన్ను రెచ్చగొట్టింది తను, మీరు బిగ్‌బాస్ రూల్స్ బ్రేక్ చేశారు? ఇక్కడ విషయాలు అక్కడ, అక్కడ విషయాలు ఇక్కడ చెప్పడం నచ్చలేదని చెబుతూ అపూర్వను త్రిగుణ్ నామినేట్ చేశాడు. ఆ తరువాత అమన్‌ను నామినేట్ చేశాడు. ఆ తరువాత ఒకరిని మోటివేట్ చేయడానికి మరొకరిని కించపరిచాడు, బచ్చాగాడు అన్నాడు అని చెబుతూ ముకేష్‌ను అమన్ నామినేట్ చేశాడు.
నరేశ్ గుమ్మడికాయను దాచగా.. షాలినీ, వర్షిణి వెతికారు. వర్షిణి గెలిచింది. వైల్డ్ కార్డుగా వచ్చి పోస్ట్ కార్డులా పని చేస్తున్నావు అని చెబుతూ అపూర్వను నామినేట్ చేసింది. ఆ తరువాత రోహిత్ ను నామినేట్ చేసింది. ఇక షాలినీ వచ్చి త్రిగుణ్ ను నామినేట్ చేసింది. మాటలు జారుతూ ఉంటారు. డామినేషన్ చేస్తారు? అని చెప్పింది.
మొత్తంగా నామినేషన్స్ గరం గరంగా నడుస్తున్నాయి. పాత విషయాలపై కొత్తగా చర్చలు మొదలెట్టారు. ఇక రేపు రోహిత్, సుధీర్ ల మధ్య వాగ్వాదం జరిగినట్లుగా చూపించారు.
