Tasty Teja : బిగ్‌బాస్ సీజన్ 7లో తొమ్మిదవ కంటెస్టెంట్.. టేస్టీ తేజ.. ఆర్టిస్ట్‌గా మొదలుపెట్టి ఫేమస్ ఫుడ్ వ్లాగర్ వరకు ప్రయాణం..
బిగ్‌బాస్ సీజన్ 7లో తొమ్మిదవ కంటెస్టెంట్ గా ఆర్టిస్ట్, ఫుడ్ వ్లాగర్(Food Vlogger) టేస్టీ తేజ(Tasty Teja) ఎంట్రీ ఇచ్చాడు.
- Saketh U
- Published On : September 4, 2023 / 09:15 AM IST
Bigg Boss Season 7 Ninth Contestant Artist and Food Vlogger Tasty Teja Full Details
Tasty Teja : తెలుగు పాపులర్ రియాల్టీ షో బిగ్‌బాస్ సీజన్ 7 నిన్న సెప్టెంబర్ 3 ఆదివారం నాడు గ్రాండ్ గా మొదలైంది. ఈసారి కూడా నాగార్జునే (Nagarjuna) బిగ్ బాస్ హోస్ట్ గా చేస్తున్నారు. బిగ్‌బాస్ సీజన్ 7 స్పెషల్ పర్ఫార్మెన్స్ లతో, సెలబ్రిటీ గెస్ట్ లతో గ్రాండ్ గా మొదలైంది. ఇవాల్టినుంచి సోమవారం టు శుక్రవారం.. రాత్రి 9.30 గంటలకు, శని, ఆది వారాల్లో రాత్రి 9 గంటలకు బిగ్‌బాస్ షో స్టార్ మా (Star Maa) ఛానల్ లో ఎంటర్టైన్ చేయనుంది. అలాగే డిస్నీప్లస్ హాట్ స్టార్ (Disney Plus Hotstar) లో 24 గంటలు లైవ్ స్ట్రీమ్ కానుంది.
ఈసారి బిగ్‌బాస్ సీజన్ 7లోకి మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ వచ్చారు. ఇందులో కొంతమంది అందరికి తెలిసిన వాళ్ళు ఉండగా కొంతమంది మాత్రం సోషల్ మీడియాలో మాత్రమే పాపులారిటీ తెచ్చుకున్న వాళ్ళని తీసుకొచ్చారు. బిగ్‌బాస్ సీజన్ 7లో తొమ్మిదవ కంటెస్టెంట్ గా ఆర్టిస్ట్, ఫుడ్ వ్లాగర్(Food Vlogger) టేస్టీ తేజ(Tasty Teja) ఎంట్రీ ఇచ్చాడు.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా ప్రయాణం మొదలుపెట్టిన తేజ ఆ తర్వాత నటుడిగా మారాడు. జబర్దస్త్ లో పలు స్కిట్స్ లో కనిపించి మంచి కమెడియన్ గా పేరు తెచ్చుకున్నాడు. జబర్దస్త్ తో వచ్చిన ఫేమ్ తో టేస్టీ తేజ అనే ఒక ఫుడ్ యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టి ఫుడ్ వ్లాగర్ గా మారాడు. మొదట తనే వివిధ రెస్టారెంట్స్ కి వెళ్లి అక్కడి ఫుడ్ గురించి వీడియోలు తీశాడు. ఈ ఛానల్ సక్సెస్ అవ్వడంతో ఇప్పుడు సెలబ్రిటీలు, సినిమా వాళ్లంతా తమ ప్రమోషన్స్ కోసం టేస్టీ తేజ వెనక పడుతున్నారు. ఇటీవల వచ్చే చాలా సినిమాలు టేస్టీ తేజ ఛానల్ లో ఓ రెస్టారెంట్ లో అతనితో కలిసి ఫుడ్ తింటూ తమ సినిమాని ప్రమోట్ చేసుకుంటున్నాయి.
దీంతో ఓ పక్క తన ఫుడ్ ఛానల్ లో వరుస వీడియోలు, ప్రమోషన్స్ చేస్తూనే సినిమాలో నటుడిగా చిన్న చిన్న పాత్రలు కూడా చేస్తున్నాడు. ఫుల్ ఫామ్ లో ఉన్న తేజకు బిగ్ బాస్ ఆఫర్ రావడంతో ఇందులోకి ఎంట్రీ ఇచ్చాడు. మరి బిగ్ బాస్ హౌస్ లో తింటాడో, వండుతాడో చూడాలి. ఈ షోతో తేజ మరింత పాపులారిటీ తెచ్చుకోవడం ఖాయం. ఈ సారి వచ్చిన వాళ్లలో కామెడీతో ఎంటర్టైన్ చేసేది తేజ ఒక్కడే కాబట్టి కరెక్ట్ గా ఆడి తన కామెడీతో మెప్పిస్తే ఎక్కువ రోజులు ఉండే అవకాశం ఉంది.
