Rathika Rose : బిగ్‌బాస్ సీజన్ 7లో పదవ కంటెస్టెంట్.. రతిక రోజ్.. అవకాశాల కోసం ఎదురుచూస్తున్న తెలుగమ్మాయి..

బిగ్‌బాస్ సీజన్ 7లో పదవ కంటెస్టెంట్ గా నటి రతిక రోజ్(Rathika Rose) ఎంట్రీ ఇచ్చింది.

Bigg Boss Season 7 Tenth Contestant Telugu Girl Artist Rathika Rose Details

Rathika Rose :  తెలుగు పాపులర్ రియాల్టీ షో బిగ్‌బాస్ సీజన్ 7 నిన్న సెప్టెంబర్ 3 ఆదివారం నాడు గ్రాండ్ గా మొదలైంది. ఈసారి కూడా నాగార్జునే (Nagarjuna) బిగ్ బాస్ హోస్ట్ గా చేస్తున్నారు. బిగ్‌బాస్ సీజన్ 7 స్పెషల్ పర్ఫార్మెన్స్ లతో, సెలబ్రిటీ గెస్ట్ లతో గ్రాండ్ గా మొదలైంది. ఇవాల్టినుంచి సోమవారం టు శుక్రవారం.. రాత్రి 9.30 గంటలకు, శని, ఆది వారాల్లో రాత్రి 9 గంటలకు బిగ్‌బాస్ షో స్టార్ మా (Star Maa) ఛానల్ లో ఎంటర్టైన్ చేయనుంది. అలాగే డిస్నీప్లస్ హాట్ స్టార్ (Disney Plus Hotstar) లో 24 గంటలు లైవ్ స్ట్రీమ్ కానుంది.

ఈసారి బిగ్‌బాస్ సీజన్ 7లోకి మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ వచ్చారు. ఇందులో కొంతమంది అందరికి తెలిసిన వాళ్ళు ఉండగా కొంతమంది మాత్రం సోషల్ మీడియాలో మాత్రమే పాపులారిటీ తెచ్చుకున్న వాళ్ళని తీసుకొచ్చారు. బిగ్‌బాస్ సీజన్ 7లో పదవ కంటెస్టెంట్ గా నటి రతిక రోజ్(Rathika Rose) ఎంట్రీ ఇచ్చింది.

Tasty Teja : బిగ్‌బాస్ సీజన్ 7లో తొమ్మిదవ కంటెస్టెంట్.. టేస్టీ తేజ.. ఆర్టిస్ట్‌గా మొదలుపెట్టి ఫేమస్ ఫుడ్ వ్లాగర్ వరకు ప్రయాణం..

రతిక రోజ్ ఎక్కువ మందికి తెలియకపోవచ్చు. ఇప్పుడిప్పుడే నటిగా అడుగులు వేస్తుంది. రతిక అచ్చ తెలుగమ్మాయి. పలు చిన్న సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది. ఇటీవల నేను స్టూడెంట్ సర్ అనే సినిమాలో పోలీసాఫీసర్ గా నటించింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటున్న రతిక సినిమాల్లో మరిన్ని మంచి అవకాశాల కోసం చూస్తుంది. ఎంత ప్రయత్నించినా సరైన అవకాశాలు రావట్లేదంటుంది రతిక. మరి బిగ్ బాస్ లో తన ఆటతో మెప్పించి మరింత పాపులారిటీ తెచ్చుకొని అవకాశాలు తెచ్చుకుంటుందేమో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు