Bigg Boss Telugu 10 : బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తున్న స్టార్ విలన్.. ఎన్టీఆర్ సినిమాతో ఫేమ్ తెచ్చుకొని..

ఈ సారి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే స్టార్స్ ఎవరు అని చర్చ జరుగుతుంది. (Bigg Boss Telugu 10)

  • Published on- September 2, 2026 / 08:57 AM IST

Bigg Boss Telugu 10

Bigg Boss Telugu 10 : బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 మరో నాలుగు రోజుల్లో మొదలు కాబోతుంది. దీంతో ఈ సారి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే స్టార్స్ ఎవరు అని చర్చ జరుగుతుంది. ఇప్పటికే అగ్నిపరీక్షతో నాలుగు సామాన్యులను ఫైనల్ చేసినట్టు సమాచారం. ఇక సెలబ్రిటీలలో సీరియల్ నటీమణులు పల్లవి గౌడ, తేజస్విని, కావ్యశ్రీ, కమెడియన్ ఎక్స్‌ప్రెస్‌ హరి, ఆటో రామ్ ప్రసాద్, నూకరాజు, రాకింగ్‌ రాకేశ్, డ్యాన్సర్ ఆట సందీప్‌ భార్య జ్యోతి, యూట్యూబర్ నందూ, రచయిత కడలి సత్యనారాయణ వెళ్తారని టాక్ నడుస్తుంది.

తాజాగా మరో పేరు కూడా వినిపిస్తుంది. ఎన్నో సినిమాల్లో విలన్ గా నటించి ఫేమ్ తెచ్చుకున్న టెంపర్ వంశీ కూడా ఈసారి బిగ్ బాస్ లోకి వెళ్తాడని ఇండస్ట్రీలో వినిపిస్తుంది. వంశీ అసలు పేరు అజయ్ అని సమాచారం. ఎన్నో ఏళ్లుగా సినీ పరిశ్రమలో ఉన్నాడు వంశీ. జూనియర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి, నెగిటివ్ రోల్స్ చేస్తూ వచ్చాడు. ఎన్టీఆర్ టెంపర్ సినిమాలో నెగిటివ్ రోల్ తో మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత కూడా విలన్ గా వరుస సినిమాలు చేస్తూ వస్తున్నాడు.

Also Read : Suhas : తమిళ సినిమా కోసం లైఫ్ ని రిస్క్ లో పెట్టిన సుహాస్.. జస్ట్ మిస్..

ఇప్పుడు వంశీ తెలుగు బిగ్ బాస్ సీజన్ 10 లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడని సమాచారం. మరి బిగ్ బాస్ సీజన్ 10 లోకి ఎవరెవరు వెళ్తారో తెలియాలంటే ఇంకో నాలుగు రోజులు ఎదురు చూడాల్సిందే. బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 సెప్టెంబర్ 6 నుంచి స్టార్ మా ఛానల్ లో టెలికాస్ట్ అవ్వనుంది. మొదటి రోజు సాయంత్రం 7 గంటలకు గ్రాండ్ లాంచ్ మొదలు అవ్వనుంది.