Bigg Boss Telugu 10 : ఇంత ఓపెన్ గా గ్రూపిజమా.. అగ్నిపరీక్ష బ్యాచ్ మరీ ఇంత చీపా? వేరే టీమ్స్‌లో ఉన్నా వాళ్లకు వాళ్ళు.. బిగ్ బాస్ 10 డే 24 ఎపిసోడ్..
షాలిని - రోహిత్ గొడవ వల్ల వారి గ్రూపిజం అంతా బయట పడింది. దీంతో రెండు టీమ్స్ మధ్య గొడవ అయింది. (Bigg Boss Telugu 10)
Bigg Boss Telugu 10
Bigg Boss Telugu 10 : నిన్న రెండు టీమ్స్ గా విడగొట్టి కెప్టెన్సీ టాస్కులు మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. అలాగే నామినేషన్స్ కూడా పూర్తయ్యాయి. ఇక నేడు నరేష్ కెమెరా ముందుకొచ్చి మొదటిసారి నామినేషన్ కి వచ్చాను, నాకు ఓట్స్ వేయండి అని ఆడియన్స్ ని రిక్వెస్ట్ చేసుకున్నాడు.
రోహిత్.. దేబ్జానీ పై తనకున్న నెగిటివిటిని తన అగ్నిపరీక్ష బ్యాచ్ దగ్గర చూపించాడు ఎప్పట్లాగే. మనం గ్రూప్ గా ఉండాలి అని అపూర్వని కూడా తన అగ్నిపరీక్ష గ్రూప్ లోకి రప్పించే ప్రయత్నం చేసాడు. ఝాన్సీ తన కత్తులు మష్రూమ్ రూమ్ లో దాచుకుంది. వంటలో హెల్ప్ చేస్తాను కానీ మష్రూమ్ రూమ్ కి వెళ్లోద్దని కండిషన్ పెట్టింది. ఈ విషయంలో షాలిని గొడవ పెట్టింది. అపూర్వ ఇది అందరికి చెప్పడంతో ముకేశ్, త్రిగున్ అపూర్వ తో గొడవ పడ్డారు. కాసేపు ముకేశ్, త్రిగున్ కలిసి అపూర్వని ఆడుకున్నారు.
బిగ్ బాస్ మళ్ళీ కత్తులు ఎవరి దగ్గర రెండు కంటే ఎక్కువ ఉంటాయో వాళ్లకు ఆరో వారంలో ఇమ్యూనిటీ లభిస్తుందని చెప్పి మరోసారి కత్తుల కోసం కంటెస్టెంట్స్ గొడవ పడేలా చేసారు. అలాగే మొదటి వారంలో వచ్చిన పవర్స్ ఇంకా వాడలేదు. వాడాలి అని చెప్పాడు. ఝాన్సీ దగ్గర ఉన్న కత్తి కోసం ఆడోళ్ళంతా ఒకరిపై ఒకరు గొడవ పడ్డారు. త్రిగున్ దగ్గరికి ఒక కత్తి రావడంతో అందరూ త్రిగున్ మీద పడ్డారు. ఈ క్రమంలో అమన్.. త్రిగున్ మణికట్టు గట్టిగా పట్టుకోవడంతో వీరి మధ్య గొడవ పెద్దదయింది. త్రిగున్ ని అమన్ తోసేసి ఇష్టమొచ్చినట్టు తిట్టాడు. పైగా అమన్ నన్ను త్రిగున్ బూతులు తిట్టాడు అని కాసేపు త్రిగున్ ని కొడతాను అని ఓవర్ యాక్షన్ చేసాడు. ఇక ఎప్పట్లాగే రోహిత్ తన అగ్ని పరిక్ష టీమ్ ని కాపాడుకోవాలని అమన్ ని ఆపడానికి చాలా ప్రయత్నించాడు. ఆ తర్వాత రోహిత్ మరోసారి త్రిగున్ పై నెగిటివిటి స్ప్రెడ్ చేసాడు. వర్షిణి ఫైర్ గా ఆడుతుండటంతో అగ్నిపరీక్ష బ్యాచ్ వర్షిణి గురించి చర్చ పెట్టారు. కాసేపు నరేష్ కామెడీ చేసాడు.
Also Read : Bigg Boss Today Promo : కెప్టెన్సీ కోసం పోరు.. ఫైర్ & లావా.. సృష్టికి గాయాలు.. బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో..
నెక్స్ట్ బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్ పెట్టాడు. రెండు టీమ్స్ కి కొన్ని టాస్కులు ఇస్తాను. ఏ టీమ్ గెలిస్తే వాళ్లలో ఒకరు కెప్టెన్ అవుతారు అని చెప్పాడు. భైరవ రెడ్ టీమ్ ఆల్రెడీ రథం టాస్క్ గెలిచారు కాబట్టి బిగ్ బాస్ సపోర్ట్ ఉంటుంది అని చెప్పాడు. సప్త శక్తి ఏ సపోర్ట్ లేకుండా గెలిస్తే వాళ్ళ గెలుపు వేరే లెవల్ అని చెప్పాడు. ఫైర్ & లావా అనే టాస్క్ ఇచ్చి రెండు టీమ్స్ తమ కలర్ డ్రమ్స్ ని తీసుకొచ్చి ఒక మార్గంలో వాటిని పాస్ చేస్తూ ఒక గోడ లాంటి హొల్స్ ఉన్న బోర్డులో పెట్టాలి. వేరే టీమ్ ఇంకో టీమ్ డ్రమ్స్ ని లాగేయొచ్చు. చివరికి ఆ హోల్స్ లో ఎవరివి ఎక్కువ డ్రమ్స్ ఉంటె వాళ్ళు విన్ అయినట్టు అని చెప్పారు. సప్త శక్తి టీమ్ లో ఉన్న అగ్నిపరీక్ష బ్యాచ్ షాలిని, చరణ్ ఇంకో టీమ్ లో ఉన్న తమ అగ్నిపరీక్ష రోహిత్ ని గెలిపించడానికి వీళ్ళ టీమ్ డిస్కషన్ లో పాల్గొనకుండా ఇంట్రెస్ట్ లేనట్టు ఓ పక్కన కూర్చున్నారు.
భైరవ రెడ్ టీమ్ నుంచి వంశీ, రామ్ ప్రసాద్, అమన్, రోహిత్ గేమ్ ఆడటానికి వచ్చారు. సప్త శక్తి బ్లూ టీమ్ నుంచి త్రిగున్, ముకేశ్, దేబ్జానీ, సృష్టిలు వచ్చారు. నరేష్ – వర్షిణి లు ఈ గేమ్ కి సంచలాక్ లు గా ఉన్నారు. భైరవ టీమ్ కి ముందే ఆట మొదలు పెట్టొచ్చు అనే సపోర్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. టాస్క్ లో మళ్ళీ రెండు టీమ్స్ గొడవ పడ్డారు. అమన్ – త్రిగున్ తో గొడవ పడ్డాడు. సృష్టికి మళ్ళీ గాయం అయింది. దాంతో సృష్టి ఏడ్చింది. ఈ టాస్క్ లో రెడ్ టీమ్ భైరవ గెలిచారు.
మళ్ళీ ఓడిన సప్త శక్తి టీమ్ నుంచి మరో కత్తి భైరవ టీమ్ వాళ్ళని తీసుకోమన్నారు. రామ్ ప్రసాద్.. దేబ్జానీ, నరేష్ కత్తులు తీసుకోవద్దు మీ వాళ్ళ కత్తులు తీసుకోండి ఆల్రెడీ వేరే వాళ్ళది తీసుకున్నారు. మీ టీమ్ ని కాపాడుకుంటున్నావు అని రోహిత్ ని అని అనడంతో తప్పక సృష్టి కత్తి తీసుకుంటాం అనాల్సి వచ్చింది రోహిత్. సృష్టి కత్తి తీసుకుందాం అనుకున్నారు కానీ బిగ్ బాస్ అమన్ ని సెలెక్ట్ చేసుకోమన్నారు. దాంతో మరోసారి అమన్ కూడా తన గ్రూపిజం చూపించి దేబ్జానీ కత్తి తీసుకున్నాడు. మళ్ళీ అగ్ని పరీక్ష బ్యాచ్ గ్రూప్ మీటింగ్ పెట్టుకున్నారు. రామ్ ప్రసాద్ మిగతా వాళ్ళతో అగ్ని పరీక్ష బ్యాచ్ ని కాపాడుకోవడానికే చేసారు అని జరిగిన డిస్కషన్ చెప్పాడు. కాసేపు నరేష్ , రామ్ ప్రసాద్ – త్రిగున్ తో కలిసి కామెడీ చేసారు.
త్రిగున్, ముకేశ్ లకు వాళ్ళ టీమ్ లో ఉన్న అగ్నిపరీక్ష బ్యాచ్ గ్రూపిజం చూపిస్తున్నారని అర్దమవడంతో తన టీమ్ లో ఉన్న చరణ్ కి అమన్ కత్తి తీసుకురా నువ్వు నిజాయితీగా గేమ్ ఆడితే అని చెప్పారు. షాలిని కత్తి వెతకడానికి వెళ్తే వర్షిణి గొడవ పడింది. కానీ రోహిత్ వర్షిణి టీమ్ అయినా షాలినికి సపోర్ట్ చేయడంతో అంతా షాక్ అయ్యారు. ఈ క్రమంలో రోహిత్ – షాలిని గొడవ పడ్డారు. రోహిత్ మా టీమ్ కి నేను సపోర్ట్ చేసుకొన్నా అని తన గ్రూపిజం బయట పెట్టాడు మరోసారి. ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకుందాం సపోర్ట్ లేకుండా అన్నాడు. షాలిని నువ్వు నాకు సపోర్ట్ చేస్తున్నావు అని జనాలకు చుపిస్తున్నావా అని గొడవ పడింది. నేను మీకు ఓపెన్ గా సపోర్ట్ చేస్తున్నా అని అన్నాడు. నేను మీకు సపోర్ట్ చేసి పిచ్చొడ్ని అయ్యాను మా టీమ్ ముందు అని తన గ్రూపిజం మొత్తం బయట పెట్టేసాడు. షాలిని – రోహిత్ గొడవ వల్ల వారి గ్రూపిజం అంతా బయట పడింది. దీంతో రెండు టీమ్స్ మధ్య గొడవ అయింది.
ముకేశ్ – రోహిత్ గొడవ పడ్డాడు. రెడ్ టీమ్ అంతా కలిసి రోహిత్ వాళ్ళ అగ్నిపరీక్ష బ్యాచ్ కి సపోర్ట్ చేస్తున్నాడు అని ప్రశ్నించారు. కానీ రోహిత్ తనకి తాను డిఫెండ్ చేసుకున్నాడు. చివర్లో మళ్ళీ అగ్నిపరీక్ష బ్యాచ్ అంతా కలిసి హగ్ చేసుకున్నారు. అగ్ని పరీక్ష బ్యాచ్ మెంబర్స్ వేరు వేరు టీమ్స్ లో ఉన్నా వాళ్లకు వాళ్ళు సపోర్ట్ చేసుకుంటుండటంతో ఇలాంటి గేమ్ ఎప్పుడూ చూడలేదు. టీమ్ కోసం ఆడకుండా ఇలా గ్రూపిజం కోసం ఆడతారా, వీళ్ళలో ఒక్కరికి కూడా ఇండివిడ్యుయాలిటీ లేదు అని విమర్శలు వస్తున్నాయి. ఇక రోహిత్ యితే కోడి తన పిల్లల్ని కాపాడుకున్నట్టు అగ్ని పరీక్ష బ్యాచ్ అందర్నీ కాపాడుకుంటున్నారు. సెలబ్రిటీలు కాస్త నయం వాళ్లలో వాళ్ళే గొడవపడి రియల్ గేమ్ ఆడుతున్నారు. నిన్నటి ఎపిసోడ్ తో అగ్నిపరీక్ష బ్యాచ్ ఇంత చీపా, గ్రూపిజం ఇంత ఓపెన్ గా చేస్తారా అని ప్రేక్షకులు సైతం షాక్ అవుతున్నారు. మరి వీకెండ్ లో దీనిపై నాగార్జున స్పందిస్తాడా చూడాలి.
