Mukesh : ఎవరూ లేరని అమ్మాయి ఇంటికి వెళ్లిన ముకేశ్.. వాళ్ళ బ్రదర్ రావడంతో.. బాత్రూంలో పాపం..
ఈ క్రమంలో ముకేశ్ తనకు జరిగిన ఓ సంఘటన చెప్తూ.. (Mukesh)
- Saketh U
- Published on- September 27, 2026 / 06:46 AM IST
Mukesh
Mukesh : బిగ్ బాస్ లో ఉండే కంటెస్టెంట్స్ తమ లవ్ స్టోరీలు, వాళ్ళ జీవితంలో జరిగిన సంఘటనలు హౌస్ లో అప్పుడప్పుడు పంచుకుంటారని తెలిసిందే. తాజాగా తెలుగు సీజన్ 10లో కొంతమంది కంటెస్టెంట్స్ కూర్చొని అలాంటి విషయాలు మాట్లాడుకున్నది నిన్నటి ఎపిసోడ్ లో చూపించారు.
ఈ క్రమంలో ముకేశ్ తనకు జరిగిన ఓ సంఘటన చెప్తూ.. ఆ అమ్మాయి ఇంట్లో ఎవరూ లేరు అని రమ్మని ఫోన్ చేసింది. సరే ఇల్లు చూద్దామని నేను వెళ్ళాను. అప్పుడు సడెన్ గా వాళ్ళ అన్న వచ్చాడు. ఏం చేయాలో తెలియక బాత్రూంలో అటక మీద ఇరుక్కొని దాక్కున్నాను. ఆరు గంటలు అక్కడే ఉన్నాను. పైన అంతా స్టోర్ రూమ్ లాగా చెత్త పెట్టారు. ఆ వాసనలోనే అక్కడే ఉన్నాను. వాళ్ళ అన్న అప్పుడే బాత్రూంకి వచ్చాడు. ఆ దరిద్రాన్ని చూడాల్సి వచ్చింది అని తెలిపాడు. అయితే ఇది ఎప్పుడు జరిగింది, ఏ అమ్మాయి విషయంలో జరిగింది అని మాత్రం చెప్పలేదు ముకేశ్.
