Bigg Boss Telugu 10 Today Promo : బిగ్‌బాస్ ఇంట్రో ఛత్రపతి.. కాట్ రాజ్‌గా నరేష్.. బిగ్‌బాస్ కౌంటర్లు.. నవ్వులే నవ్వులు..
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో 12వ రోజు ఎపిసోడ్‌కు (Bigg Boss Telugu 10 Today Promo) సంబంధించిన ఫస్ట్ ప్రొమో వచ్చేసింది.
- Thota Vamshi Kumar
- Updated on- September 18, 2026 / 11:02 AM IST
Bigg Boss Telugu 10 Day 12 Today Promo 1 Chatrapathi spoof
Bigg Boss Telugu 10 Today Promo : బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో 12వ రోజు ఎపిసోడ్‌కు సంబంధించిన ఫస్ట్ ప్రొమో వచ్చేసింది. నరేష్, రామ్‌ప్రసాద్, టెంపర్ వంశీ, అమన్‌లు కలిసి ఛత్రపతి స్పూప్‌ను చేశారు. కాట్ రాజ్‌గా నరేష్, సూరీడుగా రామ్‌ప్రసాద్, ఛత్రపతి పాత్రలో టెంపర్ వంశీ నటించారు.
నరేష్ బాడీని మసాజ్ చేసే కారెక్టర్‌లో రోహిత్ ఉన్నాడు. బాడీ మెల్లిగా నొక్కు, చితికిపోయేలా ఉందని నరేష్ కామెడీ చేస్తాడు. మీరే కదండి నిన్న వెళ్లమన్నారు అని రామ్‌ప్రసాద్ అనగా.. అది నిన్నరా అని నరేష్ అని అంటాడు. సూరీడుని కాట్ రాజ్ కొట్టేసి పడేడయడం, ఛత్రపతి వచ్చి డైలాగ్ చెప్పడం ఇవన్నీ బాగున్నాయి.
నరేష్‌ని టెంపర్ వంశీ అలా పక్కకి తోస్తాడు. అయినప్పటికి నరేష్ మళ్లీ వస్తాడు.. దీంతో నరేష్‌ని ఎత్తుకుంటాడు వంశీ. దీన్ని అంతటిని చూసిన బిగ్ బాస్ కౌంటర్లు వేస్తాడు.. కాట్ రాజ్ కండలు మరీ ఎక్కువ అయ్యాయి.. సూరీడు మరీ చిన్న పిల్లాడిలా ఉన్నాడని అనడంతో అంతా నవ్వుకుంటారు. మొత్తానికి ఛత్రపతి స్పూప్‌తో బాగానే నవ్వించినట్లు అర్థమవుతోంది.
