Bigg Boss New Captain : ఈ వారం కొత్త కెప్టెన్.. ఒక్క మ్యాజిక్ పవర్ తో ఆటని మార్చేసిన వర్షిణి.. షాక్ లో అగ్నిపరీక్ష బ్యాచ్..

కెప్టెన్సీ కోసం పాత్ టు పవర్ అనే ఒక గేమ్ మూడు లెవల్స్ తో పెట్టారు. (Bigg Boss New Captain)

  • Published on- October 2, 2026 / 10:54 PM IST

Bigg Boss New Captain

Bigg Boss New Captain : నిన్న రెండు టీమ్స్ టాస్కులు జరిగి భైరవ రెడ్ టీమ్ కెప్టెన్సీ టాస్కులకు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. ఆరో వారం వరకు ఎవరి దగ్గర మూడు కత్తులు ఉంటె వాళ్లకు ఇమ్యూనిటీ వస్తుంది కాబట్టి అందరి మధ్య కత్తులు(డాగర్స్) గురించి డిస్కషన్ జరిగింది. మొన్న రెండు రోజులు భైరవ టీమ్ టాస్కుల్లో గెలవడంతో వాళ్ళు కెప్టెన్సీ పోరుకు సెలెక్ట్ అయ్యారు. అయితే బిగ్ బాస్ ఆ టీమ్ లో ఎవరైనా అయిదుగురు మాత్రమే కెప్టెన్సీ పోరుకు సిద్ధమవ్వాలి అని చెప్పాడు బిగ్ బాస్. అది వాళ్లనే డిసైడ్ చేసుకోమన్నాడు. దీంతో భైరవ రెడ్ టీమ్ లో చర్చలు జరిగాయి. అమన్ కెప్టెన్ అవుతాను అంటే రోహిత్ వద్దు అని కారణాలు చెప్పాడు. అలాగే తన అగ్నిపరీక్ష బ్యాచ్ అందరికి ఎలా బెనిఫిట్ అవ్వాలి అని అమన్ తో చర్చించాడు. బ్లూ టీమ్ వాళ్ళు కూడా రెడ్ టీమ్ లో వాళ్లకు డిస్కషన్స్ పెట్టారు. రెడ్ టీమ్ లో వాళ్లకు వాళ్ళు ఎవరు వెళ్ళాలి అనేదానిపై గొడవలు అయ్యాయి కానీ ఇంతకీ తెగకపోవడంతో బిగ్ బాస్ తిట్టాడు. దీంతో వోటింగ్ పెట్టుకున్నారు. ఓటింగ్ వల్ల రోహిత్ మళ్ళీ తమ అగ్నిపరీక్ష బ్యాచ్ కి నష్టం జరుగుతుంది అని అమన్ తో గొడవ పడ్డాడు. అమన్ మొదట వద్దన్నా సుధీర్, ముకేశ్ చెప్పడంతో కెప్టెన్సీ పోరుకు రెడీ అయ్యాడు.

చివరగా వర్షిణి, ఝాన్సీ, రామ్ ప్రసాద్, అపూర్వ,అమన్ లు సెలెక్ట్ అయ్యారు కెప్టెన్సీ కంటెండర్ పోటీలకు. అయితే అమన్ సెలెక్ట్ అవ్వడం రోహిత్ కి ఇష్టం లేకపోవడంతో అమన్ ని పిలిచి సెలబ్రిటీల బ్యాచ్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడని తిట్టాడు. అసలు నన్ను అడక్కుండా నువ్వెందుకు డెసిషన్ తీసుకున్నావు అని అతనిపై అజమాయిషి చూపించాడు. దీంతో మరోసారి రోహిత్ తన బ్యాచ్ ని తన గుప్పిట్లో పెట్టుకున్నట్టు తెలుస్తుంది.

Also Read : Aishwarya Rajesh : బాబోయ్.. ఐశ్వర్య రాజేష్ బోల్డ్ ఫొటోలు.. షర్ట్ పై బటన్ తీసేసి..

కెప్టెన్సీ కోసం పాత్ టు పవర్ అనే ఒక గేమ్ మూడు లెవల్స్ తో పెట్టారు. చివరకు ఎవరు నిలిస్తే వాళ్ళు కెప్టెన్ అవుతారు. ఒక స్టిక్ తో పోల్స్ కి వేలాడుతున్న బ్యాగ్స్ ని కిందకు పడేసి అందులో ఉన్న తాడులు తీసుకొని ఎదురుగా ఉన్న డబ్బాలపై తాడుతో బ్రిడ్జ్ తయారుచేయాలి. ముందు వచ్చే ముగ్గురు నెక్స్ట్ లెవల్ కి వెళ్తారు. నెక్స్ట్ లెవల్ లో తాడు పై బాల్స్ మూవీ చేసే టాస్క్. అందులో ముందు చేసిన ఇద్దరూ నెక్స్ట్ లెవల్ కి వెళ్తారు. లాస్ట్ లెవల్లో బిగ్ బాస్ ముక్కలతో ఐ లోగో పూర్తి చేయాలి. ఎవరు ఫస్ట్ చేస్తే వాళ్ళు కెప్టెన్ అవుతారు. ఈ గేమ్ కి సుధీర్, షాలిని సంచలాక్ గా ఉన్నారు.

ఈ గేమ్ ఎలాంటి గొడవలు లేకుండా సాఫీగానే సాగింది. మొదటి లెవల్ అమన్, రామ్ ప్రసాద్, ఝాన్సీ గెలవగా నెక్స్ట్ లెవల్ కి అమన్, ఝాన్సీ వెళ్లారు. ఫైనల్ గా అమన్ గెలిచాడు. దాంతో అమన్ కెప్టెన్ అయ్యాడు. ఝాన్సీ ఓడిపోయినందుకు ఏడ్చింది. అయితే వర్షిణి తన మ్యాజికల్ పవర్ వాడతాను అని బిగ్ బాస్ ని అడిగింది. బిగ్ బాస్ ఓకే చెప్పి ఆమె కీస్ పంపించాడు. దీంతో ముందే రోహిత్ షాక్ అయ్యాడు. తన అగ్నిపరీక్ష టీమ్ కి ఎక్కడ అన్యాయం జరుగుతుందో అని.

Also See : Kayadu Lohar : రెట్రో లుక్స్‌లో కయదు లోహర్ క్యూట్ ఫొటోలు..

వర్షిణి మ్యాజిక్ పవర్ – ఎవరు గెలిస్తే వాళ్ళ పవర్ ని తీసేసుకోవచ్చు. దీంతో వర్షిణి అమన్ కెప్టెన్సీ తీసుకుంది. అమన్ కి సారీ చెప్పి తన కారణం తాను చెప్పింది. వర్షిణి ఇచ్చిన షాక్ కి అందరూ దాని గురించే చర్చ మొదలుపెట్టారు. కెప్టెన్ గా గెలిచినందుకు వర్షిణి కి గోల్డ్ మెడల్ ఇచ్చారు. కెప్టెన్ అయినందుకు ముకేశ్ కాళ్ళు పట్టుకొని ఆశీర్వదించమంది వర్షిణి. ఇక వర్షిణి ఇచ్చిన షాక్ కి ఇంట్లో వాళ్ళు అంతా చర్చించుకుంటున్నారు. నరేష్ ఎక్కడి పైన దాచిన కత్తులు తీస్తుంటే బిగ్ బాస్ ఎందుకు ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తున్నావు అని తిట్టాడు.

ఇక డాగార్లు(కత్తులు) ఉన్న వాళ్ళకే ఇమ్యూనిటీ ఛాలెంజ్ లో పాల్గొనే ఛాన్స్ ఉంది అని చెప్పాడు బిగ్ బాస్. ఎవరి దగ్గర ఎన్ని డాగర్స్ ఉన్నాయో చెప్పమన్నాడు బిగ్ బాస్. ఒక డాగర్ ఉంటే ఇమ్యూనిటీ ఛాలెంజ్ లో పాల్గొనొచ్చు. రెండు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే ఎవరికీ ఇమ్యూనిటీ ఇవ్వాలో కూడా డిసైడ్ చేసే ఛాన్స్ ఇవ్వొచ్చు అని బిగ్ బాస్ చెప్పాడు. దీంతో కత్తులు ఎక్కువ ఉన్న వాళ్ళ దగ్గరకు కత్తులు లేని వాళ్ళు వెళ్లి అడుక్కున్నారు. ఫైనల్ గా ఎవరి దగ్గర ఎన్ని ఉన్నాయో చెప్పామన్నారు.

అనంతరం బిగ్ బాస్ ఇమ్యూనిటీ గేమ్ పెట్టాడు. డాగార్లు ఉన్న వాళ్ళ ఫొటోలు ముందు పెట్టారు. అయితే రెండు లేదా ఎక్కువ డాగర్స్ ఉన్నవాళ్లు ఎవరు ఇమ్యూనిటీ ఇవ్వాలో డిసైడ్ చేస్తారు అని చెప్పాడు. దానికి ఓ టాస్క్ చెప్పారు. మొదట సృష్టి వంశీ ఫోటో తీసేసి తన ఫోటో పెడతా అంది. సుధీర్ వచ్చి వంశీ ఫోటోని మళ్ళీ సృష్టి ఫోటో తీసేసాడు. ఝాన్సీ త్రిగున్ ఇమ్యూనిటీ తీసేసుకుంది. త్రిగున్ సపోర్ట్ చేసాడు. వంశీ చరణ్ ఇమ్యూనిటీ తీసుకున్నాడు. దీంతో ఫైనల్ గా వంశీ, సుధీర్ లు ఆరో వారంకు ఇమ్యూనిటీ పొందారు.