Bigg Boss Weekend Episode : గెట్ అవుట్ రోహిత్.. ఆ ముగ్గురికి ఎల్లో కార్డ్స్.. డిజాస్టర్ కెప్టెన్.. నాగార్జున వీకెండ్ ఫైర్.. బిగ్ బాస్ 10 డే 27 ఎపిసోడ్..
ఒకే రోజు మూడు ఎల్లో కార్డ్స్ ఇచ్చాను ఇవాళ ఇలాంటి రోజు మళ్ళీ రాకూడదు అని చెప్పారు నాగార్జున. (Bigg Boss Weekend Episode)
Bigg Boss Weekend Episode
Bigg Boss Weekend Episode : నిన్న మ్యాజిక్ పవర్ తో వర్షిణి కెప్టెన్ అయి అందరికి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. నేడు వీకెండ్ ఎపిసోడ్ నాగార్జున డ్యాన్స్ పర్ఫార్మెన్స్ తో ఎంట్రీ ఇచ్చాడు. మొదట శుక్రవారం హౌస్ లో జరిగింది చూపించారు. అపూర్వ కెప్టెన్ రూమ్ లో వాష్ రూమ్ ఎక్కువ సేపు వాడుకున్నందుకు త్రిగున్, ముకేశ్ ఇంకొంతమంది ఆమెతో గొడవ పడ్డారు. కెప్టెన్ అయిన వాళ్లకు రెండు గోల్డ్ కాయిన్స్ ఇస్తారని తెలిసిందే. అది వాళ్ళే ఉంచుకోవచ్చు లేదా వేరే వాళ్లకు ఇచ్చుకోవచ్చు. వర్షిణి తన గోల్డ్ కోయిన్స్ ని సృష్టి కి, అమన్ కి ఇచ్చింది. రామ్ ప్రసాద్, త్రిగున్, వంశీ కలిసి కాలేజీలో సీనియర్స్ అని అందర్నీ ర్యాగింగ్ చేసారు.
అనంతరం ర్యాంప్ వాక్ ఆడించారు మూడు టీమ్స్ గా మూడు థీమ్స్ ఇచ్చి. దేబ్జానీ, త్రిగున్, సృష్టి, నరేష్ – వెడ్డింగ్ మోడల్ థీమ్. వర్షిణి, ఝాన్సీ, ముకేశ్, అమన్ – రెట్రో లుక్స్ థీమ్. షాలిని, అపూర్వ ,రోహిత్, సుధీర్ – నైట్ పార్టీ థీమ్. వంశీ, రామ్ ప్రసాద్, చరణ్ – జడ్జీలుగా ఉన్నారు. ఈ గేమ్ లో దేబ్జానీ, త్రిగున్, సృష్టి, నరేష్ గెలిచారు.
అనంతరం నాగార్జున హౌస్ మేట్స్ తో మాట్లాడటం మొదలు పెట్టారు. రావడంతోనే సీరియస్ అయి అసలు ఏం జరుగుతుంది హౌస్ లో అని ఫైర్ అయ్యారు.
Also See : Divi : తిరుచానూరు పద్మావతి టెంపుల్ లో నటి దివి..
మొదట చరణ్ ని కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచారు. రోహిత్ పైకి మాట్లాడకుండా లిప్ సింక్ తో చరణ్ తో బూతులు మాట్లాడిన వీడియో చూపించి తిట్టారు. రోహిత్, త్రిగున్, అమన్ లను గార్డెన్ ఏరియా కు వెళ్లిపొమ్మన్నారు.
వర్షిణిని మ్యాజిక్ పవర్ కరెక్ట్ టైంకి వాడి కెప్టెన్ అయ్యావు అని అభినందించారు.
అపూర్వని కెప్టెన్ రూమ్ సరిగ్గా వాడలేదు అని తిట్టారు. అపూర్వకి బయట జరుగుతున్న విషయాలు చెప్పొద్దని బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చినప్పుడు చెప్పారు. కానీ తన అగ్నిపరీక్ష బ్యాచ్ తో బయటి విషయాలు మాట్లాడినందుకు తిట్టారు. డిజాస్టర్ కెప్టెన్ అపూర్వ అని అన్నారు నాగ్.
రామ్ ప్రసాద్ ని.. నువ్వేమైనా పిస్తావా అని అన్నారు. నామినేషన్స్ డిస్కస్ చేయొద్దు అని చెప్పినా చేసాడు అని తిట్టారు. రామ్ ప్రసాద్ ఎప్పుడూ నిద్రపోవడాన్ని వీడియోలు చూపించి తిట్టారు. దాంతో రామ్ ప్రసాద్ నాకు యాక్సిడెంట్ అయినప్పుడు నెక్, నడుము ఇంజ్యుర్ అయింది దాంతో ఎక్కువ సేపు కూర్చోలేను, అందుకే అప్పుడప్పుడు పడుకుంటున్నా అని చెప్పాడు. ఇక ఎంటర్టైన్మెంట్ బాగా చేస్తున్నావు అని అభినందించారు నాగ్.
షాలిని.. తను అపూర్వాతో గొడవపడినప్పుడు F వర్డ్ వాడినందుకు సీరియస్ అయ్యారు. ఎప్పుడూ అరుస్తూనే మాట్లాడుతున్నందుకు, సౌండ్ పెంచుతున్నందుకు తిట్టారు. అరుస్తూ చెప్పాల్సిన అవసరం లేదు, అవసరం లేకపోయినా ఎందుకు అరుస్తావు అని తిట్టారు. ఆట తీరు మార్చుకోమన్నారు. ఆమె అరుస్తూ మాట్లాడిన వీడియోలు చూపించి తిట్టారు.
అమన్ కి ఎల్లో కార్డు చూపించారు. ఇది ఫైనల్ వార్నింగ్ అని, ఇంకోసారి ఎల్లో కార్డు చూపించే పరిస్థితి వస్తే ఏమి అడక్కుండానే బయటకు పంపించేస్తాను అని చెప్పారు నాగ్. అమన్ ఇష్టమొచ్చినట్టు ఆడినందుకు, తిట్టినందుకు బస్తీలో దొమ్మీలు ఏమైనా చేస్తున్నావా అని తిట్టారు.
ఝాన్సీ.. అమన్ ని కంట్రోల్ చేసినందుకు, ఆట బాగా ఆడినందుకు అభినందించారు.
ముకేశ్ ని తను అన్న కొన్ని మాటలు తప్పుగా వెళ్తున్నాయి అని చెప్పి జాగ్రత్తగా మాట్లాడమన్నారు.
దేబ్జానీ ని.. బాగా ఆడినందుకు అభినందించాడు. గేమ్ లో చీట్ చేసినందుకు సరదాగా తిట్టారు.
నరేష్ ని.. బాగా ఆడినందుకు, నవ్వించినందుకు అభినందించాడు.
వంశీని.. ఇమ్యూనిటీ గెలుచుకున్నందుకు అభినందించాడు. రెండు వారాల పాటు నామినేషన్స్ గురించి ఆలోచించకుండా హాయిగా గేమ్ ఆడుకోమన్నారు నాగ్.
సృష్టిని బాగా ఆడుతున్నందుకు, తన ఆట తీరు మారినందుకు అభినందించాడు.
సుధీర్ ని కూడా బాగా ఆడుతున్నందుకు, పాతవి వదిలేసినందుకు అభినందించాడు.
చరణ్ ని నువ్వు అసలు ఆడట్లేదు, నీ గురించి చెప్పడానికి ఏం లేదు అని తిట్టారు. నువ్వు రీ ఎంట్రీ ఇచ్చినా ఏమి చెయ్యట్లేదు. ఇలాగే ఉంటే బయటకు వెళ్ళిపోతావు అని అన్నారు నాగ్.
త్రిగున్ ని.. అమన్ తో గొడవ పడుతూ మాట్లాడిన మాటలకు తిట్టాడు. త్రిగున్ షాలిని కి సపోర్ట్ గా మాట్లాడినా షాలిని త్రిగున్ ని తప్పు అంది. దాంతో షాలిని నిజ స్వరూపం బయట పెట్టారు నాగార్జున. త్రిగున్ కి కూడా యెల్లో కార్డు చూపించి మాటలు జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చారు.
Also See : Bhagyashri Borse : బోల్డ్ డ్రెస్ లో భాగ్యశ్రీ భోర్సే స్టైలిష్ లుక్స్.. ఫొటోలు వైరల్..
ఇక ఊహించినట్టే రోహిత్ పై మాత్రం ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. మాట్లాడకుండా కేవలం లిప్ మూమెంట్స్ తో బూతులు మాట్లాడిన వీడియో అందరికి చూపించాడు. బిగ్ బాస్ ఏమి పీకలేడు అని అర్ధం వచ్చేలా చేసిన సంజ్ఞలు చూపించాడు. మూడు సార్లు ఏం పీక్కుంటావో పీక్కోమన్నాడు అని సైన్స్ చేసాడు రోహిత్. ఈ వీడియోలు చూసిన తర్వాత కూడా షాలిని సపోర్ట్ చేయడంతో షాలినిని తిట్టారు నాగ్. రోహిత్ ఇది కరెక్ట్ కాదు అని తిట్టారు. రోహిత్ అలా మాట్లాడినందుకు హౌస్ లో ఉండే అర్హత లేదు అని బయటకు వెళ్ళిపోమన్నాడు. దాంతో రోహిత్ షాక్ అయి తన సమాధానాలు చెప్పి ప్లీజ్ అని అడుక్కున్నాడు. చివరకు బిగ్ బాస్ కి సారీ చెప్పమన్నాడు నాగ్. దాంతో రోహిత్ సారీ చెప్పాడు బిగ్ బాస్. రోహిత్ కి కూడా ఎల్లో కార్డు చూపించారు. ఫైనల్ వార్నింగ్ అని చెప్పి ఇంకోసారి రిపీట్ అయితే బయటకు పంపించేస్తాను అని చెప్పారు. అలాగే త్రిగున్ ని కూడా రోహిత్ అన్న కొన్ని మాటలకు తిట్టారు. సృష్టికి తన వల్ల గాయం అయినందుకు మరోసారి రోహిత్ ని తిట్టాడు. ఈ రోజు ఫుల్ గా రోహిత్ మీద ఫైర్ అయ్యారు నాగార్జున. కానీ రెడ్ టీమ్ లో ఉండి బ్లూ టీమ్ లో ఉన్న తన అగ్నిపరీక్ష బ్యాచ్ కి సపోర్ట్ చేసిన విషయాన్ని మాత్రం ప్రస్తావించలేదు. మొత్తానికి రోహిత్ కి గట్టి వార్నింగ్ ఇచ్చారు నాగార్జున. ఇకనైనా రోహిత్ మారి తన గేమ్ తాను ఆడతాడా చూడాలి.
చివరగా నాగార్జున.. అందర్నీ వార్నింగ్ ఇచ్చి ఇష్టమొచ్చినట్టు ఆడొద్దు, జాగ్రత్తగా ఆడండి అని చెప్పి ఒకే రోజు మూడు ఎల్లో కార్డ్స్ ఇచ్చాను ఇవాళ ఇలాంటి రోజు మళ్ళీ రాకూడదు అని చెప్పారు. ఇక రేపు ఆదివారం ఎలిమినేషన్ ఉండబోతుంది.
