Bigg Boss Today Promo : మళ్ళీ గొడవ పడ్డ వర్షిణి – షాలిని.. కెప్టెన్సీ కోసం కంటెస్టెంట్స్ పోరాటం.. బిగ్ బాస్ ప్రోమో..
కానీ కెప్టెన్ అవ్వాలంటే పోరాటం మీరే చేయాలి అని చెప్పాడు బిగ్ బాస్. (Bigg Boss Telugu 10 Today Promo)
- Saketh U
- Updated on- September 15, 2026 / 12:48 PM IST
Bigg Boss Telugu 10 Day 9 Today Promo Captaincy Contender Task
Bigg Boss Telugu 10 Today Promo : నిన్న నామినేషన్స్ పర్వం చాలా వేడివేడిగా సాగింది. తాజాగా నేటి ప్రోమోని రిలీజ్ చేసారు. నేడు కెప్టెన్సీ కోసం పోటీ జరగబోతున్నట్టు తెలుస్తుంది. పవర్ ఆఫ్ పీపుల్ అనే అవతారంలో బిగ్ బాస్ ఈ కెప్టెన్సీ టాస్క్ నిర్వహిస్తున్నాడు. కెప్టెన్ గా ఎవరు ఉండాలి అనేది ప్రజలే తేల్చారు కొంతమందిని. కానీ కానీ కెప్టెన్ అవ్వాలంటే పోరాటం మీరే చేయాలి అని చెప్పాడు బిగ్ బాస్.
స్పెల్లింగ్ కరెక్ట్ చేసే ఒక టాస్క్ ఇచ్చి అది ఫాస్ట్ గా చేసిన వాళ్లకు బెలూన్ పగలకొట్టి కెప్టెన్ ఎందుకు అవ్వోద్దో రీజన్స్ చెప్పమన్నారు. దీంతో ఒక్కొక్కరు ఒక్కరికి కెప్టెన్ అవ్వకుండా ఉండటానికి రీజన్స్ చెప్పారు. బెలూన్స్ ఎక్కువ మిగిలిన వాళ్ళు కెప్టెన్ అవుతారని తెలుస్తుంది. త్రిగున్, రోహిత్, దేబ్జానీ, ముకేశ్, షాలిని, ఝాన్సీ, దేబ్జానీ, అమన్ ఈ పోటీలో ఉన్నట్టు తెలుస్తుంది.
Also Read : Sudheer – Srishti : కట్టప్పగా మారిన సుధీర్.. సృష్టి కోసమేనా..? త్రిగున్ చెప్పింది నిజం అవుతుందా?
వర్షిణి సంచాలక్ గా ఉండటంతో ఆమె తీసుకున్న ఓ నిర్ణయానికి మళ్ళీ షాలిని గొడవ పెట్టుకుంది. ఝాన్సీ మరోసారి రోహిత్ పై ఫైర్ అయింది. రోహిత్ తన అగ్నిపరీక్ష బ్యాచ్ లో ఝాన్సీ ఉండట్లేదని అందుకే నామినేట్ చేసాడని నిన్న నామినేషన్స్ లో కూడా ఫైర్ అయింది. మరి ఈ వారం కెప్టెన్ ఎవరు అవుతారో చూడాలంటే రాత్రి ఎపిసోడ్ వచ్చేదాకా ఎదురుచూడాల్సిందే. మీరు కూడా బిగ్ బాస్ ప్రోమో చూసేయండి..
