Bigg Boss New Captain : ఇది కదా గేమ్ అంటే.. రోహిత్ తోనే కెప్టెన్సీ ఇప్పించుకున్న త్రిగున్.. సడెన్ ఎలిమినేషన్.. ఏడ్చేసిన ఝాన్సీ..
రోహిత్ తోనే ఇప్పుడు త్రిగున్ కి కెప్టెన్సీ ఇచ్చేలా జరగడం హైలెట్ గా నిలిచింది. (Bigg Boss New Captain)
Bigg Boss New Captain
Bigg Boss New Captain : పొద్దున్నే అమన్ గురించి రోహిత్ నీతూతో డిస్కస్ పెట్టాడు. అమన్ శ్వేతకు సపోర్ట్ చేసినందుకు. గ్రీన్ లెవల్ సభ్యులకు కెప్టెన్ టాస్క్ పెట్టారు. అమన్ గ్రీన్ లో ఉన్నా నాగార్జున కెప్టెన్సీ ఉండదు ఈ వారం అని పనిష్మెంట్ ఇచ్చాడు కాబట్టి అతనికి ఛాన్స్ లేదు. దాంతో అమన్ ఎమోషనల్ అయ్యాడు.
కెప్టెన్సీ టాస్క్.. కంటెండర్స్ ఒక ముగ్గుర్ని సపోర్టర్స్ గా ఎన్నుకోవాలి. కంటెండర్స్ ఒక బాల్ ని పోల్ పై పెట్టుకొని తీసుకెళ్లి సపోర్టర్స్ లో ఒకరికి ఇవ్వాలి. అక్కడ బోర్డు – బాల్ గేమ్ లో వేయాలి. ఆ గేమ్ లో బాల్ పడిన దాంట్లో ఉన్న సూచనలు బట్టి సపోర్టర్స్ కంటెండర్స్ కటౌన్స్ ని ఒక మార్గంలో కదపాలి. ఎవరి కటౌట్ ముందుకు వెళ్తే వాళ్ళు గెలుస్తారు. ఇది గెలిస్తే బిగ్ బాస్ లో ఉన్నంతకాలం కెప్టెన్సీ రేసులో డైరెక్ట్ పోటీ చేయొచ్చు అని కూడా ప్రకటించాడు బిగ్ బాస్.
అయితే సపోర్టర్స్ కోసం డిస్కషన్స్ బాగానే జరిగాయి. అమన్ త్రిగున్ గెలవాలి అని కోరుకున్నాడు. అమన్ సపోర్టర్ గా కావాలని త్రిగున్, మరి కొంతమంది కావాలి అంటే రోహిత్, ముకేశ్ వద్దు అని గొడవ పడ్డారు. దీంతో రోహిత్ – అమన్ గొడవ పడ్డారు. నీ అంత కన్నింగ్ అని లేరు అని అమన్, రోహిత్ గొడవ పడ్డారు. ఇన్నాళ్లు అమన్ ని వాడుకున్న రోహిత్ ఇప్పుడు అమన్ ని నేను లేకపోతే నువ్వు లేవు అని ఇష్టమొచ్చినట్టు తిడుతూ ఫైర్ అయ్యాడు. దాంతో అమన్ కూడా ఫైర్ అయ్యాడు. ముకేశ్, వర్షిణి ఎంతకూ అమన్ ని ఒప్పుకోకపోవడంతో చివరికి ఓట్లు ద్వారా అమన్ ని ఫైనల్ చేసారు.
Also Read : Sony Komanduri : నిశ్చితార్థం చేసుకున్న టాలీవుడ్ సింగర్.. ఫొటోలు..
అమన్, వంశీ, శివ సపోర్టర్స్ గా నిలబడ్డారు. రోహిత్ ఈ టాస్క్ కి సంచాలక్. బాల్ వేయడానికి సపోర్ట్ కోసం ముకేశ్.. వంశీ, అమన్ లతో గొడవ పెట్టుకున్నాడు. ముకేశ్ నేను ఆడినా వేస్ట్ ఎవరూ సపోర్ట్ చెయ్యట్లేదు అని బిగ్ బాస్ తో మొర పెట్టుకున్నాడు అదే గేమ్ అని అర్ధం చేసుకోకుండా. త్రిగున్ చివరి వరకు వచ్చినా అమన్ వేరే వాళ్ళ కటౌట్స్ కూడా ముందుకు జరిపారు. అయినా ముకేశ్ గొడవ పెట్టుకున్నాడు. చివరకు త్రిగున్ గెలిచి అల్టిమేట్ గోట్ అయి కెప్టెన్ అయ్యాడు. దీంతో ముకేశ్ వంశీతో గొడవ పెట్టుకున్నాడు. ఈ వారం కెప్టెన్ అవ్వడమే కాక ప్రతి వారం కెప్టెన్సీ కంటెండర్ పోటీలో ఉంటాడు త్రిగున్ అని ప్రకటించాడు బిగ్ బాస్. ముకేశ్ ఓడిపోవడంతో ఓవర్ గా ఫీల్ అవుతూ త్రిగున్ ని అభినందించడానికి కూడా రాలేదు. ఇక త్రిగున్ కెప్టెన్ అవ్వడంతో రోహిత్ ఫేస్ మాడిపోయింది.
తర్వాత థమ్స్ అప్ గెలుచుకోవడానికి గేమ్ పెట్టారు రెండు టీమ్స్ గా ఆడారు. ఈ గేమ్ అయ్యాక అందరూ బిర్యానీ, థమ్స్ అప్ తిని తాగారు. అనంతరం రెడ్ లెవల్ లో ఉన్నవాళ్లకు సడెన్ ఎలిమినేషన్ ఉంటుందని చెప్పాను అని ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. బట్టలు సర్దుకొమ్మని సూట్ కేసులు కూడా పంపించాడు. అందరూ రెడీగా ఉండండి అని చెప్పాడు.
ఝాన్సీ, శ్వేతా, రామకృష్ణ, రోహిత్, సుధీర్.. రెడ్ లెవల్ లో ఉన్న వీళ్ళలో గ్రీన్ వాళ్ళు పంపాలి. ఎవర్ని పంపాలనుకుంటున్నారో వాళ్ళ తలపై ఒక బాటిల్ కొట్టి ఎందుకో రీజన్ చెప్పాలి. రామ్ ప్రసాద్ – రోహిత్, వర్షిణి – రామకృష్ణ , నీతూ – రామకృష్ణ , దేబ్జానీ – రోహిత్ , అమన్ – సుధీర్, ముకేశ్ – రామకృష్ణ, త్రిగున్ – రోహిత్ ల తలలపై పగలగొట్టారు. అయితే ఎవరూ ఏం మాట్లాడకపోయినా, బిగ్ బాస్ డిఫెండ్ చేసుకొమ్మని చెప్పకపోయినా రోహిత్.. మళ్ళీ త్రిగున్ పై మాట్లాడటం మొదలుపెట్టాడు. నిన్ను తొక్కుకుంటూ పైకి వెళ్తాను, నువ్వు లక్కుతో గెలుస్తున్నావు, నిన్ను రానివ్వను అని ఎప్పట్లాగే త్రిగున్ పై ఉన్న నెగిటివిటితో ఇష్టమొచ్చినట్టు మాట్లాడాడు. ఎన్ని సార్లు చెప్పినా, ఎల్లో కార్డు, ఇంటూ మార్క్ ఇచ్చినా, నాగార్జున తిట్టినా రోహిత్ ఏం మారలేదు అని అర్ధమవుతుంది. అసలు అందరూ సైలెంట్ గా ఉన్నా, బిగ్ బాస్ డిఫెండ్ చేసుకొమ్మని చెప్పకపోయినా ఇష్టమొచ్చినట్టు మాట్లాడాడు.
ఇక గ్రీన్ వాళ్ళు ఓట్లు వేసినా ఆడియన్స్ ఓట్స్ తో సుధీర్ ఎలిమినేట్ అయ్యాడు అని ప్రకటించాడు బిగ్ బాస్. దీంతో సుధీర్ టీమ్ ముకేశ్, వర్షిణి, ఝాన్సీ ఏడ్చారు. అయితే ముకేశ్ తన మ్యాజిక్ పవర్ వాడతాను అని బిగ్ బాస్ కి చెప్పడంతో ఆ బాక్స్ ఇచ్చాడు. ముకేశ్ పవర్ – ఏదైనా ఎవరైనా పవర్ వాడేస్తే దాన్ని మళ్ళీ ఇంకోసారి వాడుకునేలా చేయొచ్చు అని ఉంది. దాంతో ముకేశ్ ఝాన్సీ ఎలిమినేషన్ ఫ్రీ పవర్ తెప్పించాడు. ఝాన్సీ సుధీర్ కోసం వాడి సుధీర్ ఎలిమినేషన్ ని తప్పించింది ఒక వారానికి. ఇవాళ గేమ్ చూస్తుంటే త్రిగున్ ని ఓడించడానికి ముకేశ్ – రోహిత్ ఒక్కటయ్యారు అని తెలుస్తుంది. అలాగే అమన్ – రోహిత్ విడిపోయారని తెలుస్తుంది. ఇక ఇన్నాళ్లు త్రిగున్ పై ఇష్టమొచ్చినట్టు మాట్లాడి, తను కనపడటానికి త్రిగున్ ని తిట్టడం చేసిన రోహిత్ తోనే ఇప్పుడు త్రిగున్ కి కెప్టెన్సీ ఇచ్చేలా జరగడం హైలెట్ గా నిలిచింది.
