Rajeev Kanakala : రెండు కాలర్లు ఎత్తేలా ‘డ్రాగన్’ సినిమా.. మాది రాక్షస ప్రేమ.. ఎన్టీఆర్ పై రాజీవ్ కామెంట్స్ వైరల్..
రాజీవ్ కనకాల ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో డ్రాగన్ సినిమా గురించి, ఎన్టీఆర్ గురించి పలు ఆసక్తికర విషయాలు మాట్లాడారు. (Rajeev Kanakala)
Image Credits : IDream Youtube Channels
Rajeev Kanakala : రాజీవ్ కనకాల, ఎన్టీఆర్ క్లోజ్ ఫ్రెండ్స్ అని అందరికి తెలిసిందే. ఎన్టీఆర్ కెరీర్ ఆరంభం నుంచి రాజీవ్ మంచి ఫ్రెండ్. ఇద్దరూ ఈ విషయాన్ని పలుమార్లు తెలిపారు. ఎన్టీఆర్ త్వరలో డ్రాగన్ సినిమాతో రాబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. తాజాగా ఎన్టీఆర్ స్నేహితుడు, నటుడు రాజీవ్ కనకాల ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో డ్రాగన్ సినిమా గురించి, ఎన్టీఆర్ గురించి పలు ఆసక్తికర విషయాలు మాట్లాడారు.
రాజీవ్ కనకాల ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ కి బోర్ కొడితే నన్ను రారా అని పిలుస్తాడు. తను బ్యాచిలర్ గా ఉన్నప్పుడు రెగ్యులర్ గా కలిసేవాళ్ళం. పెళ్లి, పిల్లలు తర్వాత కలవడం తగ్గింది. కలవకపోయినా మా మధ్య బంధం అలాగే ఉంటుంది. చివరిసారిగా సంవత్సరం క్రితం వాళ్ళ ఇంట్లోనే కలిసాను. ఆ తర్వాత వాళ్ళింటికి వెళ్ళలేదు. ఇప్పుడు డ్రాగన్ లో చేస్తున్నాను కాబట్టి సెట్ లో కలిసాను. నాది, ఎన్టీఆర్ ది రాక్షస ప్రేమ. మేము మాట్లాడుకుంటే కూడా తిట్టుకునేలా ఉంటుంది అని తెలిపాడు.
Also Read : Vatsala Rajagopal : ‘అదుర్స్’లో ఎన్టీఆర్ బామ్మ కన్నుమూత.. 60 ఏళ్ళ వయసులో నటిగా మారి..
ఇక డ్రాగన్ సినిమా గురించి మాట్లాడుతూ.. నేను డ్రాగన్ సినిమాలో చేస్తున్నాను. ఆ డైరెక్టర్ అద్భుతం. ఏం కావాలో చెప్పి చేయించుకుంటాడు. డ్రాగన్ లో 8 రోజులు షూటింగ్ చేశాను. మళ్ళీ నెక్స్ట్ మంత్ షూటింగ్ మొదలవుతుంది. నా పోర్షన్ ఇంకా షూట్ ఉంది. తారక్ ప్లస్ ప్రశాంత్ నీల్ ప్లస్ ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రీ నిర్మాతలు కలిసాయి. ఒక అణుబాంబులా ఉంటుంది సినిమా. ఓపెన్ హైమర్ లా ఉంటుంది. ఒక కాలర్ కాదు డ్రాగన్ రెండు కాలర్లు ఎగిరేసేలా ఉంటుంది ఈ సినిమా. కాలర్ ఎత్తుకునేలా ఉంటుంది అనే వర్డ్ నేనే మొదట వాడాను గతంలో ఫ్యాన్స్ తో అని అన్నారు.
దీంతో రాజీవ్ కామెంట్స్ వైరల్ గా మారాయి. వార్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ఈ సినిమా ఫ్యాన్స్ కాలర్ ఎత్తుకునేలా ఉంటుంది అని అన్నారు. అయితే ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో కాలర్ డైలాగ్స్ పై ట్రోల్స్ వచ్చాయి. ఓ ప్రెస్ మీట్ లో నిర్మాత నాగవంశీ కూడా ఆ కాలర్ ఎత్తడాలు ఎందుకులే అని ఆ టాపిక్ ని సైడ్ చేసారు. ఇప్పుడు రాజీవ్ కనకాల మళ్ళీ రెండు కాలర్లు ఎత్తొచ్చు ఫ్యాన్స్ ఈసారి అని అనడంతో ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి. మరి దీనిపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏమని స్పందిస్తారో చూడాలి.
