Vatsala Rajagopal : ‘అదుర్స్’లో ఎన్టీఆర్ బామ్మ కన్నుమూత.. 60 ఏళ్ళ వయసులో నటిగా మారి..
వత్సల రాజగోపాల్ కొద్ది సేపటి క్రితం మరణించారు. (Vatsala Rajagopal)
Vatsala Rajagopal
Vatsala Rajagopal : అదుర్స్ సినిమాలో ఎన్టీఆర్ బామ్మగా నటించి మనందర్నీ నవ్వించిన వత్సల రాజగోపాల్ కొద్ది సేపటి క్రితం మరణించారు. గత కొన్నేళ్లుగా వృద్ధాప్య, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వత్సల రాజగోపాల్ చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ 93 ఏళ్ళ వయసులో మరణించారు. ఈమె మరణవార్త విని పలువురు సినీ సెలబ్రిటీలు ఆమెకు నివాళులు అర్పిస్తున్నారు.
కేరళకు చెందిన వత్సల రాజగోపాల్ 1953 లోనే చెన్నైకి వచ్చి ఉద్యోగం చేస్తూ అక్కడే స్థిరపడ్డారు. ఉద్యోగం చేస్తూనే పలు నాటకాలలో నటించారు. నాటకాల్లో ఆమెని చూసిన దర్శకుడు మణిరత్నం 1992లో రోజా సినిమాలో హీరోయిన్ అమ్మమ్మ పాత్రని ఇచ్చారు. అలా 60 ఏళ్ళ వయసులో నటిగా మారిన వత్సల రాజగోపాల్ తమిళ్, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో దాదాపు 400 లకు పైగా సినిమాలు, తమిళ్ లో ఓ 20 సీరియల్స్ లో నటించారు.
Also Read : Vishwak Sen : టాలీవుడ్లో మరో సినిమాటిక్ యూనివర్స్.. అనౌన్స్ చేసిన విశ్వక్ సేన్..
తెలుగులో అదుర్స్ సినిమాతో ఇక్కడ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆమె మరణవార్త విని సినీ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. ప్రస్తుతం వత్సల రాజగోపాల్ పార్థివ దేహాన్ని చెన్నైలోని పల్లవరంలో ఉన్న ఆమె నివాసంలో బంధువులు, సన్నిహితుల, సినీ ప్రముఖుల సందర్శనార్థం ఉంచారు. రేపు ఉదయం ఆమెకు అంత్యక్రియలు చేయనున్నారు.
