Bigg Boss Telugu 10 : బిగ్ బాస్ కప్పు అతనిదే.. ఈ ఇద్దరి మధ్యే పోటీ.. టాప్ 5లో ఉండేది వీళ్ళే..
టాప్ 5లో ఉంటాడు అనుకున్న రోహిత్ తన చేతులారా పాడు చేసుకున్నాడు. (Bigg Boss Telugu 10)
- Saketh U
- Published on- November 2, 2026 / 12:48 PM IST
Bigg Boss Telugu 10
Bigg Boss Telugu 10 : బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ ఆల్మోస్ట్ సగం అయిపొయింది. ఈ వారం ఝాన్సీ, రోహిత్ ఎలిమినేట్ అయిపోయారు. టాప్ 5లో ఉంటాడు అనుకున్న రోహిత్ తన చేతులారా పాడు చేసుకున్నాడు. బిగ్ బాస్, నాగార్జున, కంటెస్టెంట్స్, ఆడియన్స్ ఎవరు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా వినకుండా తనకు ఇష్టమొచ్చినట్టు ఉండి, ఇష్టమొచ్చిన మాటలు మాట్లాడి, షాలిని వెళ్లిపోవడంతో టాస్కులు కూడా సరిగా ఆడక చివరకు ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది రోహిత్.
కామనర్స్ లో కాస్తో కూస్తో కనపడేలా గేమ్ ఆడింది రోహిత్. అతను వెళ్లిపోవడంతో బిగ్ బాస్ లో టాప్ 5లో ఉండేది ఎవరు, విన్నర్ ఎవరు అవుతారు అనే చర్చ మొదలయింది. ఇన్ని రోజుల వరకు బిగ్ బాస్ చూసుకుంటే టాప్ 5 లో త్రిగుణ, ముకేశ్, దేబ్జానీ, అమన్ అయితే కచ్చితంగా ఉండేలా కనిపిస్తున్నారు. కామనర్స్ లో ఒకర్ని టాప్ 5 కి తీసుకెళ్తారు కాబట్టి అమన్ వెళ్తాడు. ఇక ఇంకొకరు నరేష్ లేదా రామ్ ప్రసాద్ లో ఒకరు ఉండే ఛాన్స్ ఉంది. ఓట్ల ఆధారంగా ఏదో ఒక వారంలో ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు అయితే ఎలిమినేట్ అవుతారు.
ప్రస్తుతం రోహిత్ వెళ్లిపోవడంతో త్రిగున్ కి టఫ్ ఫైట్ ఇవ్వడానికి ముకేశ్ ఒక్కడే ఉన్నాడు. మొదట్లో ఏమి ఆడని ముకేశ్ గత రెండు మూడు వారాల నుంచి అగ్రెసివ్ గా ఆడుతున్నాడు. రోహిత్ ఒక్కడే త్రిగున్ తో పోటీ పడలేక గత వారం నుంచి ముకేశ్ టీమ్ తో కలిసి ఆడిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం బిగ్ బాస్ లో ముకేశ్ వర్సెస్ త్రిగున్ టఫ్ ఫైట్ నడుస్తుందని తెలుస్తుంది.
అయితే ఈ సారి కప్పు మాత్రం త్రిగున్ కొడతాడు అని ముందు నుంచి అందరూ భావిస్తున్నారు. అగ్రెసివ్ గా ఆడటమే కాక, మ్యానిప్యులేట్ చేస్తూ ఎవర్ని ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలో అలా వాడుకుంటూ ఇది కదా గేమ్ అనేలా ఆడుతున్నాడు. కొన్ని గేమ్స్ లో త్రిగుణ చేసిన మ్యానిప్యులేషన్ కి హౌస్ లో కంటెస్టెంట్స్, ఆడియన్స్ సైతం ఆశ్చర్యపోయారు. గేమ్ ని ఒక్కసారిగా మార్చేయగలడు త్రిగున్. అందుకే అతనే ఈసారి కప్పు కొడతాడని భావిస్తున్నారు అంతా. మరి చివరి నిమిషంలో ఏదైనా జరిగి వేరే వాళ్లకు కప్పు వెళ్లినా ఆశ్చర్యపోనవసరం లేదు.
